ప్యాకేజీకి చట్టబద్దతకై పోరాడండి,వైసిపిని ఇలా ఎదుర్కొండి..
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేలా పార్లమెంట్ లో పోరాటంచేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎంపిలను కోరారు.
హైదరాబాద్ :ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేలా పార్లమెంట్ లో పోరాటంచేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎంపిలను కోరారు.
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పార్టీ ఎంపిలతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్నసమస్యలపై చర్చించాలని లోకేష్ పార్టీ ఎంపిలకు సూచించారు.

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ విషయమై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆయన ఎంపిలకు సూచించారు. ప్యాకేజీ వల్ల ఏ రకంగా రాష్ట్రానికి ప్రయోజనమనే విషయాన్ని వివరించాలని ఆయన ఎంపిలకు సూచించారు.
ఆంద్రప్రదేశ్ కు ప్యాకేజీకి చట్టబద్దతను కల్పించే విషయమై పోరాటం చేయాలని ఎంపిలను కోరారు లోకేష్. పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలను ధీటుగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications