India-US trade talks: "అమెరికాతో ట్రేడ్ డీల్ వద్దు.. మా పొట్ట కొట్టొద్దు"

భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ లోని యాపిల్ పంటను సాగు చేసే రైతులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించే ఏ నిర్ణయంపైనా అంగీకారం తెలపొద్దని.. దానివల్ల రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని లేఖలో స్పష్టం చేశారు. జూన్ 23 మంగళవారం నుంచి అమెరికాతో మినిస్టీరియల్ లెవెల్ లో చర్చలు ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో యాపిల్, ఆల్ మండ్స్, వాల్ నట్స్, ఇతర దేశీయ హార్టికల్చర్ పంటలను పండించే రైతులు ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

హిల్ స్టేట్ హార్టికల్చర్ ఫోరమ్ ఈ మేరకు భారత్- అమెరికా ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డీల్ కారణంగా రైతుల ప్రయోజనాలు, హార్టికల్చర్ దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నాయి. " గత కొన్ని నెలలుగా అమెరికాలోని ప్రతినిధులు భారత్ లోని వ్యవసాయ మార్కెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. తమ ఉత్పత్తులను భారత వ్యవసాయ మార్కెట్లోకి ప్రవేశపెట్టి తద్వారా లాభాలను ఆర్జించాలని అగ్రరాజ్యం చూస్తోంది.

దీనివల్ల భారత్ లో యాపిల్, ఆల్ మండ్స్, వాల్ నట్స్, ఇతర దేశీయ హార్టికల్చర్ పంటలను పండించే లక్షల మంది రైతుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఇక అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశం.. ఇప్పటికే అక్కడి రైతులను సబ్సిడీలు అందిస్తోంది. దాంతో అక్కడి వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. ఆ ప్రొడక్ట్స్ తో భారత్ లోని చిన్న, సన్నకారు రైతులు పోటీపడటం అసాథ్యం.. అని హిల్ స్టేట్ హార్టికల్చర్ ఫోరమ్ తన లేఖలో పేర్కొంది.

PMModi Farmers Ask PM Modi to Reject Any Reduction in Import Duties onFarm Produce in US Deal India

ఇక హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ తదితర కొండ ప్రాంతాల రాష్ట్రాల్లో స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా యాపిల్, వాల్ నట్ తదితర పంటలను పండించే రైతులు.. ప్రత్యామ్నాయ పంటలకు మారడం చాలా అరుదు. అందువల్ల దిగుమతులు పెరిగితే వీరి జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై హిల్ స్టేట్ హార్టికల్చర్ ఫోరమ్ కన్వీనర్ హరీష్ చౌహాన్ మాట్లాడుతూ.. తమ అభ్యర్థనను ప్రధాని మోదీ స్వాగతిస్తారని.. రైతుల ఆవేదనను అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+