అప్పుడు అమరావతిపై గ్రాఫిక్స్.. ఇప్పుడు వైసీపీ నాయకులపై గ్రాఫిక్స్; చంద్రబాబుతో జాగ్రత్త.. మంత్రి హెచ్చరిక!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంలో ప్రభుత్వం గోరంట్ల మాధవ్ ను తప్పించే ప్రయత్నం చేస్తుందని, ఆ వీడియో గోరంట్ల మాధవ్ దేనని తెలుగుదేశం పార్టీ గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేస్తే, గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో తెలుగుదేశం పార్టీ సృష్టి అంటూ వైసీపీ మంత్రులు, నేతలు మండిపడుతున్నారు.

వైయస్సార్సిపి నాయకులపై చంద్రబాబు గ్రాఫిక్స్.. ప్రజలలో అలజడి

వైయస్సార్సిపి నాయకులపై చంద్రబాబు గ్రాఫిక్స్.. ప్రజలలో అలజడి

తాజాగా ఏపీ బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ టిడిపిపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో అమరావతిపై గ్రాఫిక్స్ సృష్టించిన చంద్రబాబు, ఇప్పుడు వైయస్సార్ సిపి నాయకులపై గ్రాఫిక్స్ సృష్టిస్తూ ప్రజలలో అలజడి రేపుతున్నారు అని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ మండిపడ్డారు.

దేశంలో కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పర్మినెంట్ అడ్రెస్

దేశంలో కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పర్మినెంట్ అడ్రెస్

చంద్రబాబు జీవితమంతా గ్రాఫిక్స్ నే నని, దుష్ప్రచారాలు చేయడమేనని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఫేక్ వీడియో ను రూపొందించింది తెలుగుదేశం పార్టీ నేనని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోందని మంత్రి చనిపోయిన వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. దేశంలో కుట్ర రాజకీయాలకు చంద్రబాబు ఒక పర్మినెంట్ అడ్రస్ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక గ్రాఫిక్స్ చేసిందెవరో త్వరలోనే బయటపడుతుందని మంత్రి వెల్లడించారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ ఫేక్ వీడియో టీడీపీ సృష్టే

ఎంపీ గోరంట్ల మాధవ్ ఫేక్ వీడియో టీడీపీ సృష్టే


నాడు ఎన్టీ రామారావు ని సీఎం పదవి నుండి తప్పించటం కోసం లక్ష్మీపార్వతిని సాకుగా చూపి కుట్ర చేశారని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసి ఎదగాలని అనుకోవడం చంద్రబాబు నాయుడు నైజం అని మంత్రి తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పై టిడిపి నాయకులే ఒక ఫేక్ వీడియో రూపొందించి, వారే విదేశాలకు పంపించి అప్లోడ్ చేశారని, ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసి ట్రోల్ చేస్తున్నారంటూ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఆరోపించారు. ఇందుకు కారకులైన టిడిపి నేతలపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు మరో ముసుగు వేసుకుని మోసం చెయ్యాలని వస్తున్నాడు.. బీ కేర్ ఫుల్

చంద్రబాబు మరో ముసుగు వేసుకుని మోసం చెయ్యాలని వస్తున్నాడు.. బీ కేర్ ఫుల్

గతంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని టిడిపి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని నిలదీశారు. కాపు రిజర్వేషన్ ఇస్తానని, నాడు అల్లర్లకు కారకుడైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో జత కడుతున్నారు అంటూ మండిపడ్డారు. టిడిపి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన సూచించారు. చంద్రబాబు మరో ముసుగు వేసుకొని మోసం చేయడానికి వస్తున్నాడు అంటూ మండిపడ్డారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+