టాప్ ర్యాంకర్ మీరే కావచ్చు...బంపర్ ఆఫర్ ఇచ్చిన టీడీపీ!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాలపై ఫోకస్ చేసింది. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26లో భారీగా సభ్యత్వాలు చేయించాలని, పార్టీని క్షేత్ర స్థాయిలో తిరుగులేని పార్టీగా మార్చాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ శ్రేణులకు సభ్యత్వాల విషయంలో బంపర్ ఆఫర్ ఇస్తుంది.
సభ్యత్వాల నమోదుకు టీడీపీ ర్యాంకింగ్
ఇక ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్టోబరు 26, 2024 నుండి ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీ బంధువులను, స్నేహితులను సభ్యులుగా చేర్చాలని కోరింది. 2024-26లో మీ స్నేహితులను, మీ బంధువులను, మీ ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ సభ్యులుగా చేర్పించండి. ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయించిన వారికి ర్యాంకులు ఇస్తామని ప్రకటించింది.

ప్రతీ రోజూ టాప్ టెన్ ర్యాంకర్ల ఎంపిక
ప్రతి రోజూ టాప్ - 10 ర్యాంకర్లుగా నిలిచిన వారి పేర్లను పార్టీ సోషల్ మీడియాలో ప్రకటిస్తుంది తెలుగుదేశం పార్టీ అని సభ్యత్వాలు ఎక్కువ చేసిన వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. ఇక బంధువులు, స్నేహితులు, లేదా తెలిసిన వారికి ఎలా రిఫెరల్ చెయ్యాలో కూడా సూచించింది.
రిఫెరల్ లింక్ తో టీడీపీ సభ్యత్వాల కుస్తీ
https://wa.me/9053419999?text=TDP_RI_46786585 ఈ లింకులో ఆఖరి 8 సంఖ్యలని తీసేసి మీ సభ్యత్వంలో వున్న 8 సంఖ్యలని పెట్టుకుంటే మీ రిఫరల్ లింక్ తయారవుతుందని, ఈ లింక్‌ని మీ స్నేహితులకు, మీ బంధువులకు , మీ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి, దీని ద్వారా రిఫరల్ చేసిన క్రమంలో ఎవరైతే సభ్యులుగా చేరుతారో.. ఆటో మ్యాటిక్ గా మీ ద్వారా వారు సభ్యులుగా మారినట్టు నమోదవుతుందని పేర్కొంది.
రేపటి టాప్ ర్యాంకర్ మీరే కావచ్చు
దీంతో మీరు కూడా టాప్ ర్యాంకర్ గా నిలవండి అని టీడీపీ సూచించింది. మరింకెందుకు ఆలస్యం? మీ ద్వారా ఎక్కువ టీడీపీ సభ్యత్వాలను నమోదు చేయించండి. రేపటి టాప్ ర్యాంకర్ మీరే కావచ్చు మరియు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో భాగస్వామ్యులు అవ్వండి. అంటూ టీడీపీ కార్యకర్తలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఎక్కువ సభ్యత్వాలు చేయించిన వారిని గుర్తిస్తామని చెప్పింది. మరి టీడీపీ సభ్యత్వాల కోసం వేసిన నయా ప్లాన్ బాగా వర్కవుట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications