గంటా కు హైకమాండ్ సీరియస్ వార్నింగ్, మరోసారి..!!

కూటమిలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన సర్వే సంస్థలు ఆసక్తి కర నివేదికలు ఇస్తున్నాయి. ఇదే సమయంలో పాలనలో కొత్త నిర్ణయాలతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. ఇటు పార్టీలోని సొంత ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పైన టీడీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యవహారం కూటమిలో సంచలనంగా మారుతోంది.

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పైన టీడీపీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. తాజాగా గంటా శ్రీనివాస రావు విశాఖ నుంచి విమానాల రద్దు కారణంగా ఏర్పడిన సమస్యను వివరిస్తూ .. తాను అమరావతి రావటం కోసం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి అమరావతికి వచ్చినట్లు టికెట్లతో సహా వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఈ పోస్టు వైరల్ అయింది. దీని పైన పార్టీ అధినాయకత్వం స్పందించింది. పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ సమస్య పైన స్పందించే తీరు సరికాదని మందలించింది. ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని.. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు ఏంటని నిలదీసినట్లు సమాచారం.

TDP high Command serious on MLA ganta Srinivasa Rao

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం టీడీపీ నేత అని గుర్తు చేసింది. సమస్య ఉంటే నేరుగా రామ్మోహన్ నాయుడకు ఫోన్ చేసి వివరించాల్సిందని పేర్కొంది. భవిష్యత్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. కాగా, గంటా విశాఖ నుంచి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతుండటంతో రాష్ట్ర ఆర్థిక రాజధాని నుంచి వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది ఏర్పడుతుందని ఆ ట్వీట్ లో వివచించారు. విశాఖపట్నం నుంచి అమరావతికి విమానంలో వెళ్లాలంటే... హైదరాబాద్‌ మీదుగా ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు కూడా తనలాగే విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చి, అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారని వివరించారు.

మంగళవారం వందేభారత్‌ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారాల్సి వచ్చిందని తెలిపారు. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకు ఈ దుస్థితి వచ్చిందో ఆలోచన చేసి, తగిన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. తన ట్వీట్‌ను సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి లోకేశ్‌కు ట్యాగ్‌ చేశారు. దాంతో పాటు తాను రెండు విమానాల్లో ప్రయాణించేందుకు తీసుకున్న టికెట్లను సైతం గంటా షేర్‌ చేశారు. ఇప్పుడు గంటా చేసిన ట్వీట్ పైన పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందనే సమాచారం కూటమి పార్టీల్లో సంచలనంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+