టీడీపీ రెండో జాబితా ఫైనల్ ? 50 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్ల ప్రకటన..!
ఏపీలో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకాలను కూడా పూర్తి చేసేసిన టీడీపీ ఇప్పుడు తమ అభ్యర్ధుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని పిలిపించి వరుసగా చర్చలు జరిపిన చంద్రబాబు ఎల్లుండి రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.
నిన్నంతా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. వీటి ప్రకారం టీడీపీ 144 అసెంబ్లీ సీట్లతో పాటు 17 ఎంపీ సీట్లలోనూ పోటీ చేయబోతోంది. అలాగే జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. అటు బీజేపీ ఆరు ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది. ఈ లెక్కన టీడీపీ ఇప్పటికే ప్రకటించిన 94 మంది అభ్యర్ధుల్ని తీసేస్తే మరో 50 మంది అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.

అలాగే ఇప్పటివరకూ ఎంపీ సీట్లలో అభ్యర్ధుల్ని టీడీపీ ప్రకటించలేదు. దీంతో ఒకేసారి 17 ఎంపీ సీట్లకూ అభ్యర్ధుల ప్రకటనకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసేసిన చంద్రబాబు.. ఇవాళ మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.అలాగే 50 అసెంబ్లీ సీట్లలో అభ్యర్ధులకూ పోటీ ఉన్న నేపథ్యంలో ఆశావహులతో నేడు, రేపు చర్చించనున్నారు. అనంతరం ఎల్లుండి విడుదల చేసే రెండో జాబితాలో వీరి పేర్లను ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications