Tdp Janasena Manifesto: టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో రెడీ-విడుదలకు ముహుర్తం ఇదే..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసేందుకు జట్టు కట్టిన విపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ఉమ్మడి సభలతో జనంలోకి వెళ్తున్నాయి. ఈ మధ్యే మంగళగిరిలో ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్ కూడా విడుదల చేశాయి. ఇప్పుడు ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే టీడీపీ, జనసేన సభలో ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయబోతున్నాయి.

చిలకలూరి పేట సభలో ఈ నెల 17న ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు టీడీపీ, జనసేన నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ-జనసేన పొత్తు అన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.
చిలకలూరిపేటలో జరిగే సభలో ఉమ్మడి మేనిఫెస్టో తో పాటు భవిష్యత్ ప్రణాళికను విడుదల చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. చరిత్ర సృష్టించేలా 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభకు ఆర్టీసీ ఎండీ బస్సులు ఇవ్వకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే నిన్న రాత్రి మంగళగిరిలో జనసైనికుల ఇళ్లపై పోలీసుల దాడి దారుణమని అచ్చెన్న తెలిపారు. పోలీసుల తీరుపై అవసరం అయితే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. టీడీపీ-జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తే 7306299999 కాల్ సెంటర్ కు ఫోన్ చేయవచ్చన్నారు.
జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. చిలకలూరిపేట సభ లో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామన్నారు. సూపర్ 6 నినాదం తో అభివృద్ధి లక్ష్యం తో ముందుకెళ్తున్నామని మనోహర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది,జనసెన టీం లను పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే విఫలం అవుతుందన్నారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications