ద్వారంపూడి పై జనసేన అభ్యర్ది ఖరారు - పవన్ ఛాలెంజ్ నెరవేరేనా..!!
ఏపీలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ అభ్యర్దుల ఖరారు తుది దశకు చేరుకుంది. ఇటు టీడీపీ, జనసేన మధ్య సీట్ల ఖరారు ప్రక్రియ పైన చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ ఏపీలో ఎన్నికల వ్యూహం ఈ నెల 23న ఖరారు కానుంది. కాకినాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి మరోసారి బరిలో నిలుస్తున్నారు. దీంతో , టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్ది ఖరారు విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
కీలక సమీకరణాలు
ఈ సారి ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఉభయ గోదావరిలో మెజార్టీ సీట్లు..సామాజిక సమీకరణాలు ఆధారంగా ఇక్కడ పార్టీలు ఎన్నికల వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్దుల జాబితా దాదాపు ఖరారైంది. కాకినాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి తిరిగి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీటులో టీడీపీ, జనసేన నుంచి ఆశావాహుల పోటీకి సిద్దంగా ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్ముల్యే వనమాడ వెంకటేశ్వర రావు సీటు ఆశిస్తున్నారు. జనసేన నుంచి ముత్త శశిధర్ టికెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ కాకినాడలోనే మూడు రోజులు మకాం వేసి పార్టీ పరిస్థితిని పర్యవేక్షించారు.

కాకినాడ సీటు ఎవరిది
తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరేందుకు రంగం సిద్దమైంది. వచ్చే వారంలో జనసేనాని పవన్ స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ముద్రగడ కుటుంబానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ నుంచి జనసేనకు ఒక ప్రతిపాదన అందింది. పొత్తులో భాగంగా కాకినాడ సీటు జనసేనకు కేటాయించేందుకు టీడీపీ సిద్దమైంది. కాకినాడలో కాపు, మత్స్యకార వర్గాల ఓటింగ్ శాతం ఎక్కువ. ద్వారంపూడి ఈ రెండు వర్గాలకు చెందిన నేత కాకపోయినా స్థానికంగా అన్ని వర్గాల్లోనూ మంచి పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో కాకినాడ సిటీ ఒకటి. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని గెలవనీయనని పవన్ కల్యాణ్ శపథం చేసారు.

జనసేనలోకి ముద్రగడ
దీంతో, ఈ సారి కాకినాడ నుంచి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్దిగా ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తి కరంగా మారింది. కాపు ఉద్యమ నేత ముద్రగడను కాకినాడ నుంచి పోటీ చేయించాలని టీడీపీ తాజాగా జనసేనకు సూచించినట్లు సమాచారం. దీని ద్వారా ఓటింగ్ సమీకరణాలు అనుకూలంగా మారి..ద్వారంపూడి పైన విజయం సాధించేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అయితే, కాకినాడలో ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమని ద్వారంపూడి ధీమాగా ఉన్నారు. ముద్రగడ జనసేన కోరిన విధంగా కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. పవన్ వచ్చే కిర్లంపూడిలో ముద్రగడతో సమావేశం సమంయలో ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications