ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెండ్‌గా ఉన్నావ్..!

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పార్టలన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కూటమి కట్టాయి. మరోవైపు సొంత అన్నను ఓడించడానికి వైఎస్ షర్మిల సైతం కంకణం కట్టుకుని మరీ కాంగ్రెస్ పార్టీ తరుఫున బరిలోకి దిగుతున్నారు. ఎంతమంది కలిసి వచ్చిన కూడా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కావడంతో నేతల హడావిడా ఎక్కువగా కనిపిస్తోంది. నేతల పాటు కార్యకర్తలు కూడా భారీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ర్యాలీలో ఊహించని దృశ్యం కనిపించింది. ఓ యువకుడు వైసీపీ జెండాతో ర్యాలీకి వచ్చాడు.

tdp janasena ycp all symbols are one bike photo goes viral

విశేషం ఏమిటంటే..ఆ యువకుడు వచ్చిన బైక్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బొమ్మ కనిపించింది. అదే బైక్ మీద టీడీపీ అని కూడా రాసి ఉండటం ఇక్కడ మరో విశేషం. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెండ్‌గా ఉన్నావ్ అని కొందరు కామెంట్ చేస్తూంటే....ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా కవర్ చేశావ్ నువ్వు గ్రేట్ బ్రో అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+