స్పీకర్ అయ్యన్నపాత్రుడికి షాకిచ్చిన ఆనం-తిరుమలలో రాజకీయాలు వద్దని ట్వీట్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి దక్కని సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. అయితే గతంలో విపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన చరిత్ర ఉన్న ఆయన.. ఇప్పుడు స్పీకర్ అయ్యాక తనను తాను నియంత్రించుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమలలో ఆయన చేసిన రాజకీయ విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.
వీటిపై ఏకంగా తన సొంత పార్టీ టీడీపీలో మరో సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. మీరంటే గౌరవం అంటూనే ఆయనకు సుతిమెత్తగా చురకలు అంటించారు. అదీ ఏకంగా ఎక్స్ లో ఓ ట్వీట్ చేసి మరీ ఆయనకు అక్షింతలు వేశారు. తిరుమలలో రాజకీయ విమర్శలు చేసే విషయంలో తన వైఖరి ఇదీ అనీ సొంత పార్టీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ కే ఆనం వెంకటరమణారెడ్డి తనదైన శైలిలో చెప్పేశారు.

సర్ మీరు అంటే నాకు చాలా ఇష్టం గౌరవం కూడా, దయచేసి తిరుమల లో రాజకీయాలు వద్దు నా విన్నపం.#tirumala https://t.co/p708WMdHgT
— Anam Venkata Ramana Reddy (@anamramana) August 16, 2024
తిరుమలలో అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శల వీడియోను పోస్ట్ చేస్తూ ఆనం వెంకటరమణారెడ్డి ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన.. సర్ మీరు అంటే నాకు చాలా ఇష్టం గౌరవం కూడా, దయచేసి తిరుమల లో రాజకీయాలు వద్దు నా విన్నపం అంటూ సుతిమెత్తగా స్పీకర్ అయ్యనపాత్రుడికి చురకలు అంటించారు. దీనిపై స్పీకర్ కానీ, టీడీపీ నేతలు కానీ ఎక్కడా స్పందించలేదు. గతంలోనూ తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి ఆనం మాజీ మంత్రి రోజాను కూడా పలుమార్లు టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications