జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత -బందరులో కలకలం..!
ఏపీలో గత ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన నేతల మధ్య మచిలీపట్నంలో అనుకోని వార్ జరిగి ఆది కాస్తా దాడులు, ప్రతిదాడులు, ఫిర్యాదులు, ప్రతి ఫిర్యాదుల వరకూ వెళ్లిపోయింది. ఈ క్రమంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకోవడంతో ఈ వివాదం కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగుతున్న క్రమంలో ఈ ఘటన కలకలం రేపింది.
మచిలీపట్నంలోని పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇందులో తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ జనసేన నేతలు యర్రంశెట్టి నాని ,శాయన శ్రీనివాసరావు బ్యానర్ ను చింపేశారు. దీంతో యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ నేతలు దాడి చేశారు.దాడిలో యర్రంశెట్టి నానికి గాయాలు కావడంతో పాటు ఇల్లంతా ధ్వంసం అయింది. దీంతో ఇరువర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్ మెంట్ చేశారు.

అయితే సెటిల్ మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటి పై టీడీపీ నేతలు దాడి చేశారు. అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు. దీంతో టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు.అనంతరం టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు చిలకలపూడి స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై ఏం చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications