సీఎం జగన్ కు టీడీపీ నేత అయ్యన్న వెరైటీ బర్త్ డే విషెస్ ! పుట్టినరోజూ వదలరా..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.సొంత పార్టీ వైసీపీ నేతలతో పాటు ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నేతలు కూడా సీఎం జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదే క్రమంలో జగన్ పేరు చెప్తేనే మండిపడే టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అంతటితో ఆగకుండా ఆయనపై సెటైర్లు వేశారు.

సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన.. CM వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి. అయితే సీఎం హోదాలో మీకు ఇదే చివరి Birthday అవుతుంది. ఎందుకంటే మీరు మూడు నాలుగు నెలల్లో మాజీ సీఎం అవ్వబోతున్నారంటూ పేర్కొన్నారు. ఈ విషయం మీకూ పూర్తిగా అర్ధం అయినట్లు ఉంది. అందుకే ఒక్కరోజులో మీ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత పత్రిక కోసం రూ.100 కోట్లు కొల్లగొట్టారన్నారు.

tdp leader ayyannapatrudu birthday wishes to cm ys jagan with satires

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటనలా? ప్రైవేటు సంస్థలను బెదిరించి మరీ యాడ్స్ పేరుతో వసూలు చేస్తారా? పుట్టిన రోజు నాడూ అబద్ధాలు చెప్పడమే మీ నైజమా? అంటూ అయ్యన్న రెచ్చిపోయారు. Birthday పేరుతో ఒక్క రోజులో 100 కోట్లు కొట్టేసిన ఏకైక CM మీరేనన్నారు. పుట్టిన రోజును సైతం ఆర్థిక ఉగ్రవాదానికి వేదికగా చేసుకుంటారు కాబట్టే.. ముఖ్యమంత్రి గా మీకు ఇది చివరి పుట్టిన రోజు అవుతుంది. అక్రమ పద్దతిలో, అధికారిక దోపిడీలో మీకు మీరే సాటి. రాష్ట్రం మాత్రం లూటీ అంటూ అయ్యన్న ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+