నాకూ కులముంది.. రసికులమేగా..! అంబటి కులం ట్వీట్ కు అయ్యన్న సెటైర్..!
తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తిగత కార్యక్రమం కోసం వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై అక్కడి టీడీపీ కార్యకర్తలు దాడి చేసినంత పని చేసారు. చంద్రబాబు తప్పు చేస్తే భువనేశ్వరిని వ్యక్తిగతంగా విమర్శిస్తారా అంటూ రెచ్చిపోయారు. ఓ దశలో వారితో వాగ్వాదానికి దిగిన మంత్రి అంబటిని ఆయన వ్యక్తిగత సిబ్బంది వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ అంబటి టీడీపీని నాయకుల్ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
ఖమ్మంలో తనపై జరిగిన దాడిపై రగిలిపోతున్న మంత్రి అంబటి ఇవాళ టీడీపీ పేరు ఎత్తకుండానే కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఓ కులముంది గుర్తుపెట్టుకోండి అంటూ ట్వీట్ చేశారు. దాని కింద నారా లోకేష్ ను ట్యాగ్ చేసారు. తద్వారా టీడీపీ కార్యకర్తలు కుల ఉన్మాదంతోనే తనపై దాడి చేశారని , తనకూ ఓ కులం ఉందని గర్తుపెట్టుకోవాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అంబటి ట్వీట్ వైరల్ అవుతోంది. దీంతో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు.

నాకూ కులముందన్న మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ కు స్పందిస్తూ టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాతుడు రసికులమేగా అంటూ ఒకే పదంలో తేల్చేసారు. గతంలో వైసీపీ నేతలైన అంబటి రాంబాబు, మరో నేత అవంతి శ్రీనివాస్ మహిళల్ని లైంగికంగా వేధించినట్లు కొన్ని ఆడియోలు ప్రచారంలోకి వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరినీ వాటిపై టార్గెట్ చేస్తున్న టీడీపీ ఇవాళ అంబటి పెట్టిన కులం కామెంట్ కు సైతం దాంతోనే జవాబిచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై అంబటి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications