కూటమి నేతలపై బీటెక్ రవి అనుచరుల హల్ చల్..!!
టీడీపీ నేత బీటెక్ రవి మద్దతు దారులు రెచ్చిపోయారు. సొంత కూటమి నేతలకే హెచ్చరికలు చేసారు. టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. సొంత పార్టీ నేతల పైనే హల్ చల్ చేసారు. రెండో రోజైన ఈ రోజు వారి హంగామా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనుచరుల పైన దాడి చేసారు. కిడ్నాప్ కు పాల్పడ్డారు. దీంతో, ఎమ్మెల్సీ ఆందోళనకు దిగారు. అటు కూటమి నేతల పైనా బీటెక్ రవి మద్దతుదారుల హల్ చల్ పైన మూడు పార్టీల నేతలు మండిపడుతున్నారు.
ముదురుతున్న పోరు
పులివెందులలో టీడీపీలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. సొంత పార్టీతో పాటుగా కూటమి నేతల పైన బీటెక్ రవి మద్దతు దారులు జులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా కడప కలెక్టరేట్‌లోనే పోలీసుల సమక్షంలో వీరంతా హల్ చేయటం సంచనలంగా మారింది. ప్రభుత్వం ఉచిత ఇసుక అమలు గురించి పదే పదే చెబుతున్నా.. నదిలో నుంచి తవ్వితీయడం, రవాణాకు మాత్రమే ఛార్జీ వసూలు చేసుకునేలా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. వైఎస్‌ఆర్ జిల్లాలో మూడు ఇసుక రీచ్‌లు దక్కించుకునేందుకు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు హల్‌చల్ సృష్టించారు. తాము కాకుండా మరెవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు.

రవి మద్దతు దారుల హల్ చల్
ఇప్పటికే ఉన్న రీచ్ ల ద్వారా ఇసుక రవాణ చేస్తున్న నేతలు మరో మూడింటిని దక్కించు కోవడా నికి బాహాబాహీకి దిగారు. టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు ఇసుక రీచ్ల టెండర్లు దక్కించుకోవడా నికి ఎవ్వరినీ అటువైపు రాకుండా అడ్డుకున్నారు. చక్రాయపేట మండలంలో రెండు, సిద్ధవటం మండలంలో మరో ఇసుక రీచ్ కోసం టెండర్లు పిలిచారు. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు టెండర్లు దాఖలు చేయడానికి సమయం ఉండటంతో మధ్యాహ్నం 3గంటల నుంచే టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు మైనింగ్ కార్యాలయం వద్ద మకాం వేశారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీల్లేదని కార్యాలయం తలుపుల వద్ద అనుచరులు మోహరించారు.
ఎమ్మెల్సీ అనుచరుడిపై
టీడీపీ, జనసేన నాయకులు కూడా టెండర్లు వేయడానికి అక్కడికి వెళ్లారు. వారందరినీ కార్యాల యం బయటే నిలువరించారు. ఎవ్వరూ టెండర్ వేయడానికి వీల్లేదని బీటెక్ రవి అనుచరులు బెదిరింపులకు దిగారు. ఇక, ఈ రోజు సైతం బీటెక్ రవి మద్దతు దారుల జులం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి అనుచరుడి పైన దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వస్తు న్నాయి. దీంతో, రాంగోపాల్ రెడ్డి సతీమణి ధర్నాకు దిగారు. ఘటనా స్థలికి ఎమ్మెల్సీ చేరుకు న్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ అనుచరుడిని చితకబాదారు. టెండర్ల విషయంలో టీడీపీ, జనసేన నేతలతోనూ బీటెక్ రవి మద్దతు దారులు దురుసుగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ వ్యవహారం పై ఫిర్యాదు చేసేందుకు సొంత పార్టీ నేతలే సిద్దమయ్యారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications