వివేకా హత్యపై కొడాలికి అన్నీ తెలుసు-సీబీఐ నాలుగు తగిలిస్తే... బుద్దా వెంకన్న కామెంట్స్
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై టీడీపీ ముద్రించిన పుస్తకంపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
గుంటూరు : ఏపీలో వైఎస్ వివేకా హత్య దర్యాప్తు నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ యుద్ధానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలతో టీడీపీ ఓ పుస్తకాన్ని ముద్రించగా.. దానిపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన విమర్శల్ని తప్పుబడుతూ ఇవాళ టీడీపీ నేత బుద్దా వెంకన్న రెచ్చిపోయారు. కొడాలి నానిని ఊర కుక్క అంటూ సంబోధిస్తూ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలకు దిగారు.
లోకేష్ పాదయాత్ర ప్రారంభం కావడంతో పిచ్చి కుక్కలను జగన్ రోడ్ల మీదకు వదిలాడంటూ బుద్దా వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని, ఇతర కుక్కలు చంద్రబాబు, లోకేష్ పై నోరు పారేసుకుంటున్నారన్నారు. గుడివాడ లో జేబులు కొట్టేసే నాని చంద్రబాబు ను తిట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు, వాళ్ల నాన్న పేరు నీకెందుకురా అంటూ కొడాలిపై బుద్దా రెచ్చిపోయారు. నీ నాన్న పేరు ఏంటో చెప్పు... ఒక్కసారి అయినా చెప్పావా యన్టీఆర్ కు నువ్వు వారసుడివి ఏంటి అంటూ ప్రశ్నించారు.

లోకేష్ వారసుడు కాదా... నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు.. నువ్వు ఎన్టీఆర్ కు ఎలా వారసుడివి అంటూ బుద్దా కొడాలిని ప్రశ్నించారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి ని అనగలమన్నారు. మహా అయితే అరెస్టు చేస్తారు.. లేదా చంపేస్తారని వ్యాఖ్యానించారు. నువ్వు అసలు వైసిపి లోకి ఎప్పుడు వెళ్లావు, కోటం రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నాడు... ఆయన బాధ కలిగి మాట్లాడాడు, నీకు కోటంరెడ్డిని అనే అర్హత కూడా లేదన్నారు. గుడివాడలో హరికృష్ణకు ఎన్నికల ఏజెంట్‌వి నువ్వు, నాలుగో స్థానంలో ఉన్నాడంటే నువ్వు వెన్నుపోటు పొడిచినట్లేగా అని బుద్దా ప్రశ్నించారు.
నువ్వు మళ్లీ ఇరవై వేల ఓట్లతో గెలుస్తావా... ఈసారి ప్రజలు నిన్ను తరిమి కొడతారన్నారు.
వివేకానంద హత్య కేసు పై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేసిందని, కానీ కొడాలి వైయస్ కుటుంబంలో చిచ్చు పెట్టాడని బుద్దా ఆరోపించారు. నా తమ్ముడు నాకన్నా గొప్ప అని గతంలో వైయస్ చెప్పారని, జగన్ కు ఏంటి లాభం అన్నాడంటే... వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కొడాలికి కూడా తెలుసన్నారు. అంటే ఆస్తి, పదవి వస్తే జగన్ చంపేస్తాడని చెబుతున్నట్లేగా అని బుద్దా పేర్కొన్నారు. చంద్రబాబు బిక్షతో ఎమ్మెల్యే అయ్యి...ఆయన్నే తిడతావా
నాకు జ్ఞానం ఉంది... నీకు ఏం తెలుసని వాగుతావు అంటూ బుద్దా రెచ్చిపోయారు. కమ్మవారి కోటాలో వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వాలి, కమ్మ కోటాలో ఎమ్మెల్యే, మంత్రి కావాలి, కానీ తిట్టేది మాత్రం కమ్మ కులాన్నే అని బుద్దా విమర్శించారు.
గుడివాడ ప్రజలు రాళ్లతో కొట్టి చంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కొడాలినుద్దేశించి బుద్దా వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్లి జగన్ ని కలిసి డీల్ మాట్లాడుకుంటే టీడీపీ నిన్ను సస్పెండ్ చేసిందని, వైసిపి కోసం మొదటి నుంచి పని చేస్తున్న వారు ఆయనతో జాగ్రత్తగా ఉండాలని బుద్దా కోరారు. 2024ఎన్నికల తర్వాత వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. కోటంరెడ్డి నిచూసి బుద్ది తెచ్చుకోండి... ఆయన జగన్ ని తిడుతున్నారా అని ప్రశ్నించారు.
పోలీసులు కూడా దొంగ కేసులు పెట్టడం లేదన్నారు. జగన్ ను నమ్ముకుంటే మనం కూడా మునుగుతాం అని పోలీసులకు అర్థం అయ్యిందన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కొడాలి నానిని తీసుకెళ్లి సీబీఐ నాలుగు తగిలించాలన్నారు. అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి లను వెనుకేసుకొస్తున్న కధ మొత్తం చెబుతాడన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే నానికి తగిన బుద్ది చెబుతామన్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications