• search

ఏం మాటలవి?: పవన్‌పై బాబు, మోడీకి డెడ్‌లైన్, సీఎం హామీతో తగ్గిన సీఎం రమేష్!

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కడప: స్టీల్ ప్లాంట్ కేంద్రం కాదంటే తాము అందుకు సిద్ధమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేయగా, శనివారం దీక్ష విరమింపచేసిన చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు.

  సీఎం రమేష్ దీక్ష విరమణ: కేంద్రం, జగన్ నాటకాలంటూ చంద్రబాబు ఆగ్రహం

  కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ సర్కారు ముందు మూడు మార్గాలు ఉన్నాయని, కేంద్రానికి తాము రెండు నెలల డెడ్ లైన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రాకుండా గాలి జనార్ధన్ రెడ్డి, వైయస్ జగన్‌లు కలిసి నాటకాలు ఆడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమం తెస్తానని జనసేనాని అనడం ఏమాత్రం సరికాదన్నారు.

  ఊరుకునేది లేదు.. మోడీకి హెచ్చరిక

  ఊరుకునేది లేదు.. మోడీకి హెచ్చరిక

  కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాకపోతే తామే నెలకొల్పి ప్రజల రుణం తీర్చుకుంటామని చంద్రబాబు అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశంపై ఓ కమిటీ వేస్తామని, పోరాటాన్ని కొనసాగిస్తూ పార్లమెంటులో నిలదీస్తామని చెప్పారు. కడప ఉక్కు మా హక్కు అని, దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే వీల్లేదన్నారు. పెద్దన్నపాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం, అన్యాయం జరిగినప్పుడు అక్కున చేర్చుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మోసగిస్తానంటే ఊరుకునేది లేదన్నారు.

  మోడీ ముందు 3 మార్గాలు పెట్టి చంద్రబాబు సవాల్

  మోడీ ముందు 3 మార్గాలు పెట్టి చంద్రబాబు సవాల్

  స్టీల్ ప్లాంట్‌కు కడప కంటే అనుకూలమైన ప్రాంతం ఉంటే చూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు. కేంద్రం ముందు మూడు మార్గాలు ఉన్నాయని, ఒకటి కేంద్రం స్టీల్ ప్లాంట్ పెడితే రాష్ట్రం సహకరిస్తుందని, రెండోది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (సగం సగం) ఏర్పాటు చేద్దామని, లేదంటే మూడో మార్గంగా మేమే పరిశ్రమ నెలకొల్పుతామన్నారు. అయితే అందుకు అనుగుణంగా ఎంఎండీఆర్ నిబంధనలు సవరించాలని, ఇందుకు రెండు నెలల సమయం ఇస్తున్నామన్నారు. కేంద్రం ముందుకు రానంటే తాము నిర్మిస్తామని చంద్రబాబు చెప్పడంతో సీఎం రమేష్ దీక్ష విరమించినట్లుగా చెబుతున్నారు.

   ఇంత జరుగుతున్నా జగన్ మాట్లాడటం లేదు

  ఇంత జరుగుతున్నా జగన్ మాట్లాడటం లేదు

  సొంత జిల్లాలో ఇంత జరుగుతున్నా జగన్‌ నోరు మెదపకపోవడం దారుమని చంద్రబాబు అన్నారు. అంతటితో ఆగకుండా ఆ పార్టీ నాయకులు దీక్షలను తప్పుబడుతూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రం తిరుమల వెంకటేశ్వరుడితోను ఆటలు ఆడే ప్రయత్నాలు చేసిందన్నారు. నోటీసులు పంపి పెత్తనం చలాయించే ప్రయత్నం చేసిందని, రమణదీక్షితులుతో స్వామివారి ఆభరణాలపై విమర్శలు చేయిస్తోందని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారానికి వందిమాగధులను ఏర్పాటు చేసుకున్నారన్నారు.

  ఏం మాటలవి?.. పవన్ పైన చంద్రబాబు

  ఏం మాటలవి?.. పవన్ పైన చంద్రబాబు

  ఉత్తరాంధ్ర ఉద్యమం తెస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ చెప్పడం సరికాదని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంను నేనే అభివృద్ధి చేశానని, మరోపక్క కేంద్రం రాష్ట్రం పట్ల అహంభావాన్ని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే తాము రాజీనామాకు కూడా సిద్ధమని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rajya Sabha member and TDP leader CM Ramesh ended his indefinite hunger strike demanding an integrated steel plant in Kadapa district that was promised in the AP Reorganisation Act on the 11th day. Andhra Pradesh Chief Minister Chandrababu Naidu ended the MP’s hunger strike by offering him a glass of lemon juice.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more