జంబో టిటిడిపై హైకోర్టులో పిల్ - కేంద్ర కేబినెట్ కంటే ఎక్కువగా..రద్దు చేయాలి : రేపు విచారణకు ఛాన్స్..!!
కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన టీటీడీ బోర్డు వివాదం ఇప్పుడు కోర్టుకు చేరింది. ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యత్వం కోసం అనేక మంది పోటీ పడ్డారు. సీఎం జగన్ పైన పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. దీంతో.. 25 మంది బోర్డు సభ్యులుగా.. 50 మందిని బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో..కొందరు సభ్యులు ఇప్పటికే ప్రమాణ స్వీకారం సైతం చేసారు. అయితే, ఈ బోర్డు పైన టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీఎంకు లేఖ రాసారు.
జంబో బోర్డు ఏర్పాటును..అందులో కొందరి నియామకం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఏపీతో పాటుగా మహారాష్ట్ర..తెలంగాణ..తమిళనాడు..కర్ణాటక నుంచి సభ్యులుగా అవకాశం కల్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం గవర్నర్ ను కలిసి ఇదే అంశం పైన ఫిర్యాదు చేసారు. ఇప్పుడు ఈ అంశం న్యాయస్థానానికి చేరింది. టీడీపీ కళ్యాణ దుర్గం ఇన్ ఛార్జ్ గా మాదినేని ఉమా మహేశ్వర నాయుడు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ఎపి ఎండోమెంట్ యాక్ట్ 1987కు విరుద్దంగా బోర్డు నియామకం జరిగిందని పిల్ లో పేర్కొన్నారు.

ఇటువంటి జంబో బోర్డుతో సామాన్య ప్రజలను ఇబ్బందులు తప్పవని పిటీషన్ లో వివరించారు. అదే సమయంలో దేశాన్ని పాలించే కేంద్ర మంత్రుల సంఖ్య కంటే టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని అందులో పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొంటూ 52 మంది పేర్లతో జారీ చేసిన రెండు జోవోలను రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. హిందూ దేవాదాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నియామక ప్రక్రియ జరిగిందని పిటీషన్ లో వివరించారు. ఇక, ఈ పిటీషన్ రేపు ( మంగళారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Recommended Video
తాజాగా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఫార్సు చేసారంటూ ఒక సభ్యుడిని ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకం చేసారని ప్రచారం సాగింది.దీని పైన కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసారు. తాను..తన శాఖ నుంచి ఎవరి పేరున సిఫార్సు చేయలేదని..దీని పైన పరిశీలన చేయాలని కోరారు. ఇక, ఇప్పుడు హైకోర్టులో పిల్ దాఖలు కావటంతో...సభ్యులుగా ఖరారైన వారిలో కొత్త ఆందోళన కనిపిస్తోంది. కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ వారిలో మొదలైంది.












Click it and Unblock the Notifications