గొడ్డళ్లతో టిడిపి నేత హత్య: రాజకీయ ప్రత్యర్థులే

గుంటూరు: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండల పరిధిలోని పాపాయపాలెం గ్రామ పరిధిలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. టిడిపి నాయకుడు సింగారెడ్డి వెంకటరామి రెడ్డిని ప్రత్యర్థులు పాత కక్షలతో హతమార్చారు.

సిఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు - సింగారెడ్డి వెంకట రామిరెడ్డి (65) సాయంత్ర సమయంలో నారుమడికి నీరుపెట్టేందుకు వరిచేను వద్దకు వెళ్లారు. రోజుమాదిరిగానే చేను వద్ద ఉన్న అతనిని ప్రత్యర్థులు కొందరు మోటారుబైకుపై వచ్చి గొడ్డలితో నరకగా మెగభాగంలో తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులు పరారయ్యారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సిఐ తెలిపారు.

Murder

ప్రత్యర్థులే చంపారు..

ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తమపై పోటీచేసి పరాజితులైన ప్రత్యర్థులే కక్షపెంచుకుని, కాపు కాసి తమ తండ్రిని హత్య చేశారని, వీరిపై చట్ట పరిధిలో న్యాయం కోసం పోరాటం చేస్తానని హతుడి కొడుకు, సర్పంచ్ సింగారెడ్డి బ్రహ్మారెడ్డి తెలిపారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాజకీయంలో తమకు అడ్డుగా ఉన్న వారిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారు నీచ రాజకీయాలతో అడ్డు తొలిగించుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలు ఇకపై సాగనీయమని, కార్యకర్తలకు పూర్తి రక్షణగా ఉంటామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+