టీడీపీ నేత దారుణ హత్య: రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు

Subscribe to Oneindia Telugu

గుంటూరు: జిల్లాలోని వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తంగిరాల పాపిరెడ్డి(42)ని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాపిరెడ్డి టీడీపీ మాచర్ల నియోజకవర్గం బాధ్యులు కొమ్మారెడ్డి చలమారెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రె స్పార్టీకి అనుకూలమైన గ్రామంలో పాపిరెడ్డి టీడీపీ కార్యక్రమాలను విస్తృతం చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు సహించలేకపోయాయి.

A TDP leader murdered by some YSRCP leaders in Guntur district on Wednesday.

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున గ్రామంలోని సత్రం ప్రధాన రహదారిపై దారికాచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపిరెడ్డిపై ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ పాపిరెడ్డిని మాచర్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.

మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మాచర్ల ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంట గ్రామంలో ఆధిపత్యం కోసం ఈ హత్య చేశారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ అమలు చేసి పికెట్‌ నిర్వహిస్తున్నారు. స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A TDP leader murdered by some YSRCP leaders in Guntur district on Wednesday.
Please Wait while comments are loading...