ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై లోకేష్ పరువునష్టం దావా-గుంటూరు కోర్టులో రూ.50 లక్షలకు..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇదే క్రమంలో వైసీపీ సర్కార్ లో ఇసుక అక్రమాలపై టీడీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇందులో మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిని సాక్షి పత్రికలో నారాసురుడే ఇసుకాసురుడు అనే శీర్షికతో సెప్టెంబర్ 1న ప్రచురించారు.
దీనిపై స్పందించిన నారా లోకేష్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మోపిన నిరాధారమైన ఆరోపణల కారణంగా తన కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లిందంటూ పరువునష్టం నోటీసులు పంపారు. ప్రజాబాహుళ్యంలో తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలగజేయాలనే దురుద్దేశ్యంతో మంత్రి పెద్దిరెడ్డి చేసిన నిరాధారమైన ఆరోపణలకు మనస్తాపం చెంది ఈ నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. ఈ నిరాధార నిందారోపణలకు నష్ట పరిహారం కింద రూ.50 కోట్లు చెల్లించవలసినదిగా, బహిరంగంగా షరతులు లేని క్షమాపణను సదరు సాక్షి దినపత్రికలో అదే చోటు అదే ప్రాముఖ్యతతో తెలపాలని కోరారు.

అలా చేయని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు ద్వారా లీగల్ నోటీసులు పంపారు. వాటిని చిత్తూరు జిల్లా సడుం మండలం, యెర్రాతివారి పల్లె గ్రామంలోని మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి, సెక్రటేరియట్‌లోని ఆయన ఛాంబర్‌కు పంపారు. అయితే నోటీసులను తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాటికి జవాబు ఇవ్వటం గాని, క్షమాణలు చెప్పటం గాని చేయలేదని తెలిపారు. దీంతో నారా లోకేష్ ది.15.12.2023న గుంటూరు మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications