ఎన్నికల వేళ వైసీపీ చేతికి లోకేష్ బ్రహ్మాస్త్రం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. సీఎం జగన్ చేస్తున్న నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పు ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. ఇటు టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా సీట్లు, మేనిఫెస్టో పైన కలిసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక..ముఖ్యమంత్రిగా పవన్ కు అవకాశం లేదని లోకేష్ తేల్చేసారు. ఇదే సమయంలో మెజార్టీ ఓట్ బ్యాంక్ పైన ప్రభావం చూపే సంక్షేమ పథకాల పైన లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లోకేష్ వ్యాఖ్యలతో : లోకేష్ రాకీయంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్లు షేర్ చేసుకుంటున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కలిసి సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఏ మాత్రం రెండో ఆలోచన లేదని..చంద్రబాబు సీఎంగా కొనసాగుతారని నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్న అభిమానులు..జనసైనకులు టీడీపీతో పొత్తుతో నిరుత్సాహానికి గురయ్యారు. చంద్రబాబు- పవన్ సీఎం పదవి షేరింగ్ ఉంటుందనే అంచనాలతో ఉన్నారు. కానీ, అలాంటి ఆలోచన లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు చర్చ మొదలయ్యాయి.

TDP Leader Nara Lokesh made interesting comments on Navaratnalu if TDP Comes in power

నవరత్నాలు - సూపర్ సిక్స్ : ఇదే సమయంలో లోకేష్ టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం జగన్ 55 నెలల కాలంగా అమలు చేస్తున్న నవరత్నాలే తాము ప్రకటించిన సూపర్ సిక్స్ గా అమలు చేస్తామని లోకేష్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నవరత్నాలు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్ అమలు చేస్తున్నారు. ఇవే అమలు చేయటానికి టీడీపీ సూపర్ సిక్స్ ప్రకటించిందా అనే చర్చ మొదలైంది. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం పైన జగన్ నాడు పాదయాత్ర నుంచి నేటి వరకు ప్రతీ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. దీని ద్వారా చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని..ఆయన విశ్వసనీయత పైన దెబ్బ కొట్టారు. ఇప్పుడు తిరిగి పార్టీ మహానాడు వేదికగా టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ హామీలను ప్రకటించింది.

TDP Leader Nara Lokesh made interesting comments on Navaratnalu if TDP Comes in power

ఎవరికి కలిసొచ్చేను : జగన్ అమలు చేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రం శ్రీలంక అవుతుందని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన పథకాలను కాపీ కొట్టి మహానాడులో సంక్షేమ పథకాలుగా ప్రకటన చేసారని వైసీపీ ఆరోపించింది. తాజాగా నారా లోకేష్ యువగళం ముగింపు సభలోనూ చంద్రబాబు తిరిగి ఆ పథకాలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక..జగన్ నవరత్నాలను అమలు చేస్తుండగా..తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ గా తిరిగి నవరత్నాలను అమలు చేస్తామని చెప్పటం ద్వారా..టీడీపీతో కొత్తగా వచ్చే ప్రయోజనం ఏంటనే చర్చ వినిపిస్తోంది. లోకేష్ అటు పవన్ కు సీఎం పదవి షేరింగ్...ఇటు సంక్షేమ పథకాల పైన చేసిన వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలగా మలచుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+