Nara Lokesh Volleyball : వాలీబాల్ ఆడిన నారా లోకేష్.. పాకాలలో విద్యార్ధులతో..
రాష్ట్రంలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్.. ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో నడిచారు. ఈ సందర్భంగా స్ధానికంగా విద్యార్ధులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. దీంతో లోకేష్ తో కలిసి వాలీబాల్ ఆడేందుకు విద్యార్ధులు కూడా ఆసక్తి చూపారు.
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఉదయం పాదయాత్ర కొనసాగించిన లోకేష్.. మధ్యలో విరామం అనంతరం తిరిగి సాయంత్రం యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్ర పాకాలలోని జడ్పీ హైస్కూల్ వైపు సాగింది. అక్కడ జడ్పీ హైస్కూల్ మైదానంలోకి వెళ్లిన నారా లోకేష్ కు అక్కడ ఆడుతున్న విద్యార్ధులు కనిపించారు. వారిని పలకరించిన లోకేష్.. వారితో పాటు కాసేపు వాలీబాల్ ఆడారు.

నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నారా లోకేష్.. పాదయాత్ర రూపంలో తమ గ్రామానికి, స్కూలుకు రావడం, తమతో ఆడేందుకు ఆసక్తి చూపడంతో విద్యార్ధులు కూడా ఆయనతో ఆడేందుకు పోటీ పడ్డారు. జడ్పీ హైస్కూల్ విద్యార్దులు ఉత్సాహంగా ఆడుతుంటడంతో లోకేష్ కూడా వారితో కలిసి కాసేపు ఆడుతూ ఉల్లాసంగా కనిపించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున టీడీపీ నేతలు కూడా అక్కడికి తరలిరావడంతో లోకేష్ తిరిగి పాదయాత్రలోకి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications