Nara Lokesh : నారా లోకేష్ ర్యాగింగ్ కంటిన్యూ-ఈసారి సెల్ఫీ ఏంటో తెలుసా..!
ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్.. ప్రభుత్వాన్ని ర్యాగింగ్ చేసేందుకు విన్నూత్న మార్గం ఎంచుకుంటున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్.. ప్రతీ అంశంలోనూ తమ ప్రభుత్వానికీ, గత టీడీపీ ప్రభుత్వానికీ మధ్య తేడా ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ కూడా అదే తరహాలో కౌంటర్ ప్రచారానికి తెరదీసింది. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్..ఇప్పుడు అదే పనిలో బిజీగా కనిపిస్తున్నారు.
యువగళం పాదయాత్రలో టీడీపీ హయాంలో నెలకొల్పిన సంస్ధల్ని గుర్తుచేసేలా నారా లోకేష్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాటితో ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నారు. తమ పార్టీ హయాంలో వచ్చిన సంస్ధలివీ.. మీ ప్రభుత్వంలో తెచ్చిన సంస్ధలేవీ అంటూ ఆయన సవాల్ చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసే విధంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు, తెచ్చిన సంస్థల ముందు సెల్ఫీలు దిగి మేము తెచ్చినవి ఇవి, నువ్వు ఏమి తెచ్చావు జగన్ అంటూ సెటైరిక్‌గా ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాతో మొదలైన ఈ ట్రెండ్ తిరుపతిలోనూ కొనసాగిస్తున్నారు.

తిరుపతి నియోజకవర్గంలో ఇవాళ పాదయాత్రగా వెళుతున్న నారా లోకేష్.. ఐతేపల్లి వద్ద కాండోర్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు సెల్ఫీ దిగారు. డైబ్బయి ఏళ్లకి పైగా చరిత్రగలిగిన ప్రఖ్యాత విద్యా సంస్థ కాండోర్ టీడీపీ హయాంలోనే ఏర్పాటైంది. ఈ సంస్థకి అప్పట్లో చంద్రబాబు సర్కారు 8 ఎకరాల భూమి కేటాయించింది. దీంతో ఆ విషయాన్ని గుర్తుచేస్తూ లోకేష్ మరో ఛాలెంజ్ విసిరారు. ఇప్పటివరకూ టీడీపీ కృషితో వచ్చిన ఉద్యోగ, ఉపాధి కల్పించే కంపెనీలు సంస్థల ముందు ఫోటోలు దిగి చాలెంజ్‌లు విసిరిన లోకేష్, కాండోర్ ముందు సెల్ఫీ దిగి మేము తెచ్చిన ప్రఖ్యాత విద్యాసంస్థ ఇది అని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications