చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని-కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కామెంట్స్

ఏపీలో పట్టాభి ఎపిసోడ్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన మాటలదాడి ఇంకా కొనసాగుతోంది. పట్టాభి ఎపిసోడ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా స్పందించారు.

తాజాగా సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి మాల్దీవులు పారిపోయిన టీడీపీ నేత పట్టాభికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైఎస్సార్సీపీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్రపూరిత తత్వం చంద్రబాబుదని ద్వారంపూడి ఆరోపించారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

tdp leader pattabhi have life threat from chandrababu : ysrcp mla dwarampudi shocking comments

చంద్రబాబు ఢిల్లీ టూర్ పైనా ద్వారంపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు టీడీపీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని కాకినాడ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోరడంపైనా ఆయన స్పందించారు. గతంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన అపాయింట్‌మెంట్‌ కోరడానికి సిగ్గుండాలని ద్వారంపూడి అన్నారు. చంద్రబాబు రాజకీయాలకు ఇదే నిదర్శమన్నారు.

టీడీపీ నేత పట్టాభి ముందుగా హెరాయిన్, గంజాయి స్మగ్లింగ్ ఆరోపణళలు చేసింది ద్వారంపూడిపైనే. కాకినాడ తీరంలో ఓ బోటు దగ్ధం కాగా అందులో నుంచి నల్లటి పొగలు బదులుగా తెల్లటి పొగలు వచ్చాయని, అంటే అందులో డ్రగ్స్ ఉన్నట్లేనని పట్టాభి గతంలో వ్యాఖ్యానించారు. ఈ బోటు దగ్ధం వెనుక ద్వారంపూడి హస్తం ఉందని కూడా ఆరోపించారు. అప్పటి నుంచి ద్వారంపూడి వర్సెస్ పట్టాభి వార్ సాగుతోంది. తాజాగా వైసీపీ సర్కార్ పట్టాభిని అరెస్టు చేసిన తర్వాత బెయిల్ లభించింది. ఆ తర్వాత పట్టాభి అదృశ్యం కావడంపై ద్వారంపూడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+