వర్సిటీ: 'మంత్రి గంటా హీహెచ్‌డీ ఎక్కడ చేస్తారో'
విశాఖపట్నం: విశాఖ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మరింతగా ఎక్కువైంది. కొంతకాలంగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తూనే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై తెలుగుదేశం పార్టీ నేత గవిరెడ్డి రామానాయుడు సోమవారం విరుచుకుపడ్డారు. పూటకో పార్టీ మార్చే గంటా, అయ్యన్న పాత్రుడిపై విమర్శలు చేస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు, తన రాజకీయ లబ్ధి కోసం 'టెన్త్ చంద్రబాబు స్కూల్, ఇంటర్ చిరంజీవి కాలేజీ, డిగ్రీ కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో చేరారని అన్నారు. పీజీ కోసం మళ్లీ చంద్రబాబు కాలేజీలో చేరిన ఆయన మరి హీహెచ్‌డీ ఎక్కడ పూర్తి చేస్తారో' అంటూ వ్యగ్యంగా మాట్లాడారు.
మంత్రి అయ్యన్న పాత్రుడికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, అవకాశవాద, పార్టీ మార్చే రాజకీయాలు ఆయనకు లేవని రామానాయుడు అన్నారు. కాగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ ఆవంతి శ్రీనివాస్‌లు లేకుండా మాడుగుల నియోజకవర్గంలో మంత్రి అయ్యన్న పాత్రుడు శుక్రవారం నాడు పలు అధికారక కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన విషయం తెలిసిందే.

శుక్రవారం ఉదయం మాడుగుల నియోజక వర్గంలో వివిధ కార్యాక్రమాలకు హాజరైన మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తాను వ్యాపారవేత్తను కానని, పార్టీలు మారే తత్వం తనకు లేదని గంటా శ్రీనివాసరావు పేరు చెప్పకుండా అయ్యన్న వ్యాఖ్యానించారు.
తాను ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన క్రమశిక్షణ గల నేతనని అన్నారు. తాను స్ధానికుడినని, ఇతర నేతల మాదిరిగా ఎక్కడినుంచో వలస రాలేదన్నారు. మరోవైపు అయ్యన్నపాత్రుడి పర్యటనను చివరి నిముషం వరకు అడ్డుకోవాలని పట్టుదలతో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం విఫలమైంది.












Click it and Unblock the Notifications