పిఠాపురంలో వంగా గీత భారీ వసూళ్లు - టీడీపీ నేత వర్మ షాకింగ్ - పవన్ ఎంట్రీ వేళ..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా విపక్ష జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో అయితే ఇవి మరింత వేడెక్కేలా ఉన్నాయి. దీనికి కారణం పవన్ టార్గెట్ గా వైసీపీ చేస్తున్న రాజకీయాలే. అదే సమయంలో పవన్ ప్రత్యర్ధుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా టీడీపీ నేత వర్మ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగా గీతపై ఆయన సంచలన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు.
పిఠాపురంలో వైసీపీ అభ్యర్ధిగా ఉన్న కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత భారీ అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ నేత వర్మ ఆరోపణలు చేశారు. స్ధానికంగా ఆమె పోస్టులు అమ్ముకుని రూ.6 కోట్లు సంపాదించారంటూ వర్మ ఆరోపించారు. ఆమె ఎక్కడ ఎలా పోస్టులు అమ్ముకున్నారో వివరిస్తూ వీడియో విడుదల చేశారు. ఇందులో స్ధానికంగా పలు పోస్టులకు ఆమె ఎంత మేర వసూలు చేశారన్న దానిపై వర్మ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

5 ఏళ్లు పిఠాపురం ప్రజలను గాలికి వదిలేసిన గీత గారు, ఇప్పుడు ఇలా వచ్చారు.. అలా పోస్టుల పేరుతో రూ. 6 కోట్ల అవినీతికి తెర తీశారు. పిఠాపురం అభివృద్ధిని గాలికి వదిలేసి ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి హంగామా చేస్తే ప్రజలు నమ్మరు. వైసీపీని నమ్మే పరిస్థితే లేదు. pic.twitter.com/tYyPw9IrGB
— SVSN Varma (@SVSN_Varma) March 29, 2024
పిఠాపురంలో స్ధానికంగా ఉన్న వంగా గీత బంధువులు, ఆమె వారికి వేయించిన పోస్టులు, వాటికి వసూలు చేసిన మొత్తంపై వర్మ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. గతంలోనూ పిఠాపురంలో ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే కాకినాడ ఎంపీ సీటు పరిధిలోకే పిఠాపురం అసంబ్లీ సీటు కూడా ఉంది. ఈ నేపథ్యంలో వంగా గీత అవినీతిని వర్మ టార్గెట్ చేయడం ద్వారా పవన్ కు మార్గం సుగమం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో తన ప్రచారం ప్రారంభించబోతున్నారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications