Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పారాసిటామాల్ వికటించిందా పిచ్చి కూతలు కూస్తున్నారు.. వైసీపీ రాక్షససేన : టీడీపీ నేతల ఫైర్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, బుద్దా వెంకన్నలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను , అలాగే ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసి మాట్లాడటంపై వారు ధ్వజమెత్తారు .

వినలేని బూతులు, వేధింపులతో అధికారులను ఇబ్బంది పెడుతున్నారు

వినలేని బూతులు, వేధింపులతో అధికారులను ఇబ్బంది పెడుతున్నారు

ఇక ట్విట్టర్ వేదికగా స్పందించిన అచ్చెన్నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల సమావేశంలో ‘అన్నా... మీరే ముందుకు నడిపించాలి' అన్న జగన్... ఇప్పుడు మాత్రం నిజస్వరూపం చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు . వైసీపీ రాక్షస సేన అని, వినలేని బూతులు, వేధింపులతో అధికారులపై విరుచుకుపడుతున్నారని ఆయన వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు.

జగన్ స్వార్థానికి అధికారులను బలివ్వాలని చూస్తున్నారన్న అచ్చెన్నాయుడు

జగన్ స్వార్థానికి అధికారులను బలివ్వాలని చూస్తున్నారన్న అచ్చెన్నాయుడు

ఇక అంతేకాదు కొన్ని రోజుల క్రితం ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్‌ని, తాజాగా ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్‌ను టార్గెట్ చేశారని, వైసీపీ నేతలు , సీఎం జగన్ చేసే తప్పుడు పనులకు సహకరించడం లేదని జగన్ ప్రభుత్వం అధికారులను మానసికంగా వేధిస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దొంగ పనులకు సహకరించమని బెదిరించి, అధికారులను జైలు పాలు చేశారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మరోసారి జగన్ స్వార్థానికి అధికారులను బలివ్వాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

కేంద్ర విచారణ జరుగుతుంది.. ఊచలు లెక్కపెట్టటానికి సిద్ధంగా ఉండండి

కేంద్ర విచారణ జరుగుతుంది.. ఊచలు లెక్కపెట్టటానికి సిద్ధంగా ఉండండి

ఇక బుద్దా వెంకన్న కూడా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్ ఆఖరికి ఎన్నికల సంఘం కమిషనర్ ని సైతం బూతులు తిడుతూ బెదిరించారు. మీరు చేస్తున్న అకృత్యాలను పూసగుచ్చినట్టు రమేష్ కుమార్ గారు కేంద్రానికి లేఖ రాసారు. విచారణ ప్రారంభమైంది చేసిన అరాచకాలకు త్వరలోనే ఏ 1, ఏ 2 లతో సహా విచ్చలవిడిగా నోటితో రెచ్చిపోయిన వారు సైతం ఊచలు లెక్కపెట్టడం ఖాయం అంటూ పోస్ట్ చేశారు.

Recommended Video

    Polavaram Project Works Speedup | Godavari Water Flow Doing Its Bit
    మీ క్రిమినల్ గేమ్స్ కి ఎండ్ కార్డు పడే రోజులు త్వరలోనే

    మీ క్రిమినల్ గేమ్స్ కి ఎండ్ కార్డు పడే రోజులు త్వరలోనే

    విజయసాయి రెడ్డి ...పేరాసిటామాల్ వికటించిందా పిచ్చి కూతలు కూస్తున్నారు మీ జగన్ గారు. కొంపతీసి ఆయన చెప్పారని మొహానికి బ్లీచింగ్ పౌడర్ రాసుకున్నారా? తేడాగా మాట్లాడుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అంతే కాదు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడంలో పేటెంట్ రైట్స్ జగన్ గారికి ఉన్నాయనే విషయం మర్చిపోయారా? అధికారులను దొంగ పనులకు వాడుకొని జైలుకి పంపిన చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నావా? మీ క్రిమినల్ గేమ్స్ కి ఎండ్ కార్డు పడే రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త అంటూ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+