వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో ప్యాకేజీ ఎంత: వీర్రాజుపై విరుచుకపడ్డ టీడీపీ, 'బడ్జెట్‌పై వైసీపీ డబుల్ గేమ్ ఇలా'

|
Google Oneindia TeluguNews

అమరావతి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోమవారం మండిపడ్డారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని నిలదీశారు.

ఏపీ ప్రజలు వైసీపీ అధినేత వైయస్ జగన్ మాటలు నమ్మడం లేదన్నారు. కానీ సోము వీర్రాజు మాత్రం వైసీపీ ఏజెంటుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనది సొంత అజెండానా, వైసీపీ అజెండానా, బీజేపీ అజెండానా చెప్పాలని దుయ్యబట్టారు.

లోకసభలో టీడీపీ కంటే వైసీపీ ఓ అడుగు ముందు! నోటీసు, సభ వాయిదా, మోడీ అలా చేశారా అని బాబులోకసభలో టీడీపీ కంటే వైసీపీ ఓ అడుగు ముందు! నోటీసు, సభ వాయిదా, మోడీ అలా చేశారా అని బాబు

అమిత్ షా పేరుతో సభ పెట్టి ఎంత కలెక్షన్

అమిత్ షా పేరుతో సభ పెట్టి ఎంత కలెక్షన్

రాజమండ్రిలో అమిత్ షా పేరుతో సభ పెట్టి ఎంత కలెక్షన్ చేశారో చెప్పాలని బుద్ధా వెంకన్న నిలదీశారు. టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీని ఆయన ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. నీతిమంతుడైతే ఎమ్మెల్సీ ఎందుకు తీసుకున్నారన్నారు. తాము ఇచ్చిన ఎమ్మెల్సీ తీసుకొని ఆయన రాష్ట్రంలో తిరుగుతున్నారని చెప్పారు.

Recommended Video

TDP-YSRCP MPs Protest In Parliament
జగన్‌తో ప్యాకేజీ ఎంత

జగన్‌తో ప్యాకేజీ ఎంత

సోము వీర్రాజు వ్యాఖ్యలపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనకు జగన్‌తో జరిగిన ప్యాకేజీ ఏమిటో, ఎంతో చెప్పాలని బుద్ధా వెంకన్న నిలదీశారు. ఆయనతో జగన్‌కు ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో చెప్పాలన్నారు. సోము వీర్రాజు ఇష్టం వచ్చినట్లు టీడీపీని, చంద్రబాబును అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సస్పెండ్ అయ్యేవారని జీవీ ఆంజనేయులు

సస్పెండ్ అయ్యేవారని జీవీ ఆంజనేయులు


సోము వీర్రాజుపై మరో టీడీపీ నేత జీవీ ఆంజనేయులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వారు టీడీపీలో ఉంటే ఎప్పుడో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేవారని ఆయన చెప్పారు. ఆయన వైసీపీ తొత్తు అని ధ్వజమెత్తారు.

బీజేపీకి పార్ట్ టైం, వైసీపీకి ఫుల్ టైం

బీజేపీకి పార్ట్ టైం, వైసీపీకి ఫుల్ టైం


సోము వీర్రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైమర్‌గా, బీజేపీకి పార్ట్ టైమర్‌గా పని చేస్తున్నారని జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలో (టీడీపీ) ఉంటే ఎప్పుడో సస్పెండ్ అయ్యేవారని చెప్పారు. సోము వీర్రాజు తెలుసుకొని మాట్లాడాలన్నారు.

బడ్జెట్ పైన వైసీపీ డబుల్ గేమ్

బడ్జెట్ పైన వైసీపీ డబుల్ గేమ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పైన వైసీపీది డబుల్ గేమ్ అన్నారు. బడ్జెట్ బాగుందని ఎంపీలు ఢిల్లీలో చెబుతున్నారని, ఏపీలో మాత్రం బాగా లేదని ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసుల మాఫీ కోసం జగన్, వైసీపీ, ఢిల్లీలో బీజేపీతో చేతులు కలిపేందుకు కాచుకొని కూర్చుందని చెప్పారు.

English summary
Telugu Desam Party leaders Buddha Venkanna, GV Anjaneyoulu fire at BJP leader Somu Veerraju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X