జగన్‌కి రివర్స్: స్వీట్స్ పంచుకున్న టిడిపి, 16పై ఉత్కంఠ

తెలుగుదేశం పార్టీ భారీ మున్సిపాలిటీలను గెలుచుకోవడంతో సీమాంధ్రలోని ఆ పార్టీ కార్యకర్తలు, జిల్లా పార్టీ కార్యాలయాల్లో, హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మిఠాయిలు పంచుకున్నారు. సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్లు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా బాగా ఉంటుందని చాలామంది భావించారు. కానీ టిడిపి సాధించిన మున్సిపాలిటీలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దరిదాపుల్లో కూడా లేదు. ఇక కాంగ్రెసు పార్టీ కనీసం ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది.
మున్సిపల్ ఫలితాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రతికూలంగా ఉండటంతో... ఇప్పుడు అందరి దృష్టి మే 16 పైన పడింది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్నాయి. ఆ రోజు ఫలితాలు వీటికి భిన్నంగా ఉంటాయా లేక ఇవే పునరావృతం అవుతాయా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications