ప్రత్యేక కలకలంపై టిడిపి: మోడీతో చెపుతాం, చట్టవిరుద్ధం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అర్హత లేదని ప్రణాళికా సంఘం చెప్పినట్లుగా వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం స్పందించారు. ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ... ఎపికి పదేళ్ల పాటు తప్పక ప్రత్యేక హోదా లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. ఇప్పటికే ఈ విషయమై తాము చర్చించామని చెప్పారు.
హామీ కాదు... ప్రకటన: యనమల
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడారు. లోకసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు ప్రకటన చేశారని గుర్తు చేశారు. ప్రధాని హోదాలో ఆయన ఇచ్చినది హామీ కాదని, ప్రకటన అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రణాళికా సంఘం అనడం చట్ట విరుద్ధమన్నారు. ప్రత్యేక హోదాపై ప్రణాళికా సంఘానికి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది తప్ప, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం లేదన్నారు. ప్రణాళికా సంఘం వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపికి తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందని ఎపి మంత్రి నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications