విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ నేతలకు శాశ్వత రాజధాని హైదరాబాదే !.. కోర్టు మెట్టికాయలు వేసినా బుద్ధి రాలా !! : టీడీపీ

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఏపీ రాజధానిగా హైదరాబాద్ ఉందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. సీఎం జగన్‌కు పాలన చేతగాక‌నే తమ మంత్రులతో ఇలా దిగజారుడు మాటలు మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు హైదరాబాదే శాశ్వతంగా రాజధాని అని చురకలంటించారు. బహుశా నాలుగో రాజధానిగా హైదరబాద్‌ను పెట్టుకుంటారేమో ? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

1వైసీపీ నేతలకు హైదరాబాద్‌దే ఏపీ రాజధాని..

1వైసీపీ నేతలకు హైదరాబాద్‌దే ఏపీ రాజధాని..


వైసీపీ నేతలకు ఏపీ రాజధాని హైదరాబాద్‌దే అయితే అక్కడికే వెళ్లిపోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తూ పాలన సాగించేందుకు తాము ఇక్కడికి వచ్చామన్నారు. ఇప్పుడు వారు హైదరాబాద్ రాజధాని అంటే ఏం చేయగలమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజధానిపై రోజుకోక డ్రామాతో సీఎం జ‌గ‌న్‌ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దుర్మార్గపు పాలనలో ప్రజలకు ఒరిగిందేమిలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నా గవ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

జగ‌న్ బెద‌రింపులు

జగ‌న్ బెద‌రింపులు


బీఏసీ సమావేశంలో సీఎం జగన్ తమను బెదిరిస్తున్నారని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వారి బెదిరింపులకు ఇక్కడ బెదిరేవాళ్లు లేరని హెచ్చరించారు. ఇదే దూకుడుతో టీడీపీ ముందుకు వెళ్తోందని చెప్పారు. ప్రజా సమస్యల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్న గవర్నర్‌ని మాత్రమే గో బ్యాక్ అన్నాం తప్పా.. ఆయనను అగౌరపరచలేదని పేర్కొన్నారు. రాజధానిపై కోర్టు మొట్టికాయలు వేసినా వైసీపీ నేతలకు బుద్ధిమాత్రం రాలేదని పయ్యావుల దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సహాపడేందుకే.. ఏపీ రాజధాని హైదరాబాద్ అంటూ వైసీపీ నేతలు కొత్త పల్లవి అందుకుంటున్నారని ఆరోపించారు. వారు భవిష్యత్తులో, శాశ్వతంగా హైదరాబాద్‌లోనే ఉంటారని విమర్శించారు.

Recommended Video

AP Cabinet Key Decisions | Oneindia Telugu
3గ‌వ‌ర్న‌ర్ విఫ‌లం

3గ‌వ‌ర్న‌ర్ విఫ‌లం

జగన్ ప్రభుత్వ పాల‌న‌ను సక్రమ మార్గంలో నడిపించడంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. గవర్నర్ ఉత్సవ విగ్రహంలా ఉండడం సరికాదన్నారు. రాష్ట్రంలో నడుస్తున్న దుర్మార్గపు పాలనపై, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడతామని హెచ్చరించారు. గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై దాడి జరిగినా, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసినా గవర్నర్ స్పందించలేదు. అటు గవర్నర్ పేరు మీద అప్పులు తీసుకున్నా కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలతో కూడిన ప్రసంగం తాము వినలేం.. అందుకే సభను వాకౌట్ చేసినట్లు తెలిపారు.. ఆసత్యాల‌తో కూడిన ప్రసంగాన్ని వినలేకే బయటకు వచ్చేశామని దుయ్యబట్టారు.

English summary
TDP leaders leaders satires on CM YS Jagan and Minister bosta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X