Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ ఎమ్మెల్యే సెల్ఫ్ గోల్, మీడియాతో పెట్టుకుంటావా ?, చంద్రబాబు వార్నింగ్ ?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హుషారుగా పనిచేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మూడు పార్టీల నాయకులు ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే తపనతో పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేక సందర్బాల్లో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకి సూచించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మనం చేయకూడదని, ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు, ఆ పార్టీల నాయకులకి సూచించారు. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు.

TDP MLA Bojjala Sudhir Reddy s followers who gave a warning to the media

చంద్రబాబు నాయుడుకి కొన్ని తెలుగు దినపత్రికలు, టీవీ ఛానల్లో కొమ్ముకాస్తున్నాయని, ఆ దిన పత్రికల పేర్లు, ఆ టీవీ ఛానల్ లో పేర్లు బహిరంగ సభల్లో పదేపదే చెప్పిన వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. ఆ దినపత్రిక టీటీడీకి పూర్తి మద్దతు ఇస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం కూడా తెలిసిందే. అలాంటి దిన పత్రికకు చెందిన రిపోర్టర్ ను టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బెదిరించారని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

ఇదే వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిక్కుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ట్రాక్టర్ ఇసుకకు రూ. 500 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు దినపత్రికలో రెండు రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. ఈ విషయంపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు సీరియస్ అయ్యారని సమాచారం. తరువాత బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ఆ దిన పత్రిక రిపోర్టర్ కు ఫోన్ చేసి నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నీకు చివరి రోజులు దగ్గరపడతాయని బెదిరంచారని ఆరోపణలు ఉన్రాయి.

నువ్వు ఇక ముందు మర్యాదగా ఉండాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు జరిగితే నువ్వు ఎందుకు అప్పుడు వార్తలు రాయలేదని, ఇప్పుడు మాత్రమే నీకు ఇలాంటి వార్తలు రాయాలని అనిపిస్తుందా అని ఎమ్మెల్యే అనుచరులు ఆ రిపోర్టర్ ను నిలదీశారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకోసారి మా నాయకుడి గురించి ఇలాంటి రాతలు రాస్తే నీకు అవే చివరి రోజులు అవుతాయని టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆ రిపోర్టర్ కు వార్నింగ్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

TDP MLA Bojjala Sudhir Reddy s followers who gave a warning to the media

ఆ దినపత్రిక రిపోర్టర్ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించినా కూడా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు ఏమాత్రం వినలేదని తెలిసింది. ఇదే విషయం పూర్తి మ్యాటర్ తో ఆ దినపత్రికలో రావడంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఆ ప్రముఖ దినపత్రిక చంద్రబాబు సహకరిస్తోందని ఆరోపించిన జగన్ అదే దినపత్రిక యజమానిపై గతంలో కేసులు కూడా పెట్టించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+