నారా లోకేష్ పాదయాత్రలో గంటా శ్రీనివాస్- కీలక హామీ
తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇవ్వాళ శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కలిసి నడిచారు.
పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 49వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. సోమవారమే ఆయన కదిరిలో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

కదిరిలో విస్తృతంగా..
స్వర్ణకార సంఘం, ఆర్యవైశ్య ప్రతినిధులను నారా లోకేష్ కలుసుకున్నారు. కదిరిలోని పీవీఆర్ గ్రాండ్ వద్ద నిర్వహించిన సమావేశాలలో ముస్లింలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానికులు ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లింలు ఎంతో వెనుకబడ్డారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రాంచ్ కెనాల్స్ పరిశీలన..
ఇవ్వాళ కదిరి మండలంలోని బొంతలవారిపల్లి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. బ్రాంచ్ కెనాళ్లను పరిశీలించారు. ఈ కెనాల్ ద్వారా చిత్తూరు జిల్లాకు మంచినీరు, సాగునీరు వెళ్తుందని, చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పూర్తి చేసిందని అన్నారు. తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలకు మంచినీరు, సాగునీటిని అందించారని చెప్పారు. నదుల అనుసందానం ద్వారా కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమకు తీసుకొచ్చారని అన్నారు.
పాదయాత్రలో గంటా..
కాగా- ఇవ్వాళ ఆయన పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కదిరి మండలంలో ఏర్పాటు చేసిన క్యాంప్ వద్ద నారా లోకేష్ ను విశాఖపట్నం నార్త్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కలుసుకున్నారు. సుమారు అరగంట పాటు ఆయనతో సమావేశం అయ్యారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర శాసన మండలి నియోజవర్గంలో విజయం సాధించినందుకు నారా లోకేష్ ఆయనను అభినందించారు. పాదయాత్రలో లోకేష్ తో కలిసి నడిచారు గంటా శ్రీనివాస్.

లోకేష్ ను కలిసిన ఎమ్మెల్సీలు..
ఇటీవలే శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు వేపాడ చిరంజీవి రావు-ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ - కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ- భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి విజయం సాధించారు. వారిని నారా లోకేష్ అభినందించారు. శాలువ కప్పి సన్మానించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకొందని, దానికి నిదర్శనమే ఈ విజయమని వ్యాఖ్యానించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications