టీడీపీకి భారీగా పెరిగిన ఓట్లు, సీట్లు: ఆసక్తికర లెక్కలు చెప్పిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఏదో జరిగిపోయింది అని ప్రచారం తప్ప వైసిపి నాయకులు మనస్ఫూర్తిగా సాధించిన గెలుపు కాదు అది వారికి కూడా తెలుసు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

టీడీపీకి బాగా పెరిగిన ఓట్లు, సీట్లు

తెలుగుదేశం పార్టీకి భారీగా ఓట్లు, సీట్లు పెరిగాయని తెలుగుదేశం పార్టీకి 14.22 శాతం సీట్లు పెరిగాయని ఇక టీడీపీకి 14.83 శాతం ఓట్లు పెరిగాయని, కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.దొంగ ఓట్లతో , దొంగ నోట్లతో కుప్పం లో వైసీపీ సాధించిన గెలుపు ఓ గెలుపేనా అని ప్రశ్నించిన గోరంట్ల బుచ్చయ్య ప్రకాశం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకూ తెలుగుదేశం పార్టీ హవా కొనసాగిందని పేర్కొన్నారు. ఇక గత ఎన్నికలకు ఇప్పుడు ఎన్నికలకు మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ లెక్కలు చెప్పారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి .

గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు వ్యత్యాసం ఇదే .. గోరంట్ల

గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు వ్యత్యాసం ఇదే .. గోరంట్ల

2021 మార్చి మున్సిపల్ ఎన్నికలకు, 2021 నవంబర్ మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం, సీట్ల శాతాన్ని వివరించారు. 2021 మార్చి మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి 30.13 ఓట్ల శాతాన్ని నమోదు చేస్తే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 44.96 ఓట్ల శాతాన్ని నమోదు చేసిందని, గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓట్ల శాతం 14.83 శాతం అదనంగా ఓట్ల శాతం నమోదైందని పేర్కొన్నారు. ఇక సీట్ల శాతం విషయానికి వస్తే మార్చిలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 12.72 శాతం సీట్లను దక్కించుకుందని, నవంబర్లో జరిగిన ఎన్నికలలో 26.94 సీట్ల శాతాన్ని దక్కించుకుందని పేర్కొన్నారు. ఇక సీట్లు మొత్తం 14.22 శాతం పెరిగిందని తెలిపారు.

ఆరు నెలల వ్యవధిలోనే పుంజుకున్న టీడీపీ

ఆరు నెలల వ్యవధిలోనే పుంజుకున్న టీడీపీ

ఆరు నెలల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ పుంజుకుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ఫలితాల సమీక్షను, టిడిపి పుంజుకున్న తీరును వివరించారు. 2020 మార్చి 12 నగరపాలికలు, 75 పురపాలికలు, నగర పంచాయతీలలో 2,164 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 52.63 శాతం ఓట్లు 82.60 శాతం సీట్లు వైసీపీ చేజిక్కించుకుంది అని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరు నెలల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతులో ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.

టీడీపీ గెలుపును తారుమారు చేయడానికి వైసీపీ అధికార దుర్వినియోగం

టీడీపీ గెలుపును తారుమారు చేయడానికి వైసీపీ అధికార దుర్వినియోగం

12 మున్సిపాలిటీలలో ఏడు మున్సిపాలిటీలకు గాను టిడిపి నువ్వా నేనా అన్నట్టు బలమైన పోటీ ఇచ్చిందని, మూడు మున్సిపల్ నగర పంచాయతీలలో గెలుపు సాధించిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
టీడీపీ గెలుపును తారుమారు చేయడానికి వైసీపీ అధికార దుర్వినియోగానికి దిగజారిందని బుచ్చయ్య విమర్శలు గుప్పించారు. వైసీపీ విజయం సాధించిందని చెప్పుకుంటున్న చోట వైసీపీ ఏం చేసిందో అందరికీ తెలుసని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

వైసీపీ సాధించింది కూడా ఓ గెలుపేనా ? అంటున్న టీడీపీ

వైసీపీ సాధించింది కూడా ఓ గెలుపేనా ? అంటున్న టీడీపీ

కుప్పంలో గెలిచామని సీఎం జగన్, మంత్రులు జబ్బలు చరుచుకుని సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఇప్పటికే మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలకు ఎన్నికలు పరాకాష్ట అని , వైసీపీ సాధించింది కూడా ఓ గెలుపేనా అంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కుప్పంలో వైసీపీ ఏవిధంగా గెలిచిందో అందరికీ తెలుసని, తాము వైసీపీ విజయాన్ని అలా చూడటం లేదని, ఈ ఎన్నికల్లో విజయం టీడీపీదని లెక్కలు చెప్తూ వైసీపీ నేతల వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+