ప్రధాని మోదీ రోడ్ షో- చంద్రబాబు సభలకు లింక్ పెట్టిన పయ్యావుల కేశవ్

అమరావతి: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 1పై చెలరేగిన రాజకీయ దుమారం ఇంకా తగ్గట్లేదు. ఈ జీఓను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసినప్పటికీ- తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దీన్ని వివాదం చేస్తూనే వస్తోన్నారు. ఈ జీఓను విడుదల చేయడానికి గల కారణాలను అటు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తోన్నప్పటికీ లెక్క చేయట్లేదు. జీఓను జారీ చేయడాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. కాపీలను భోగి మంటల్లో వేసి తగులబెట్టి- తమ నిరసన తెలియజేశారు.

11 మంది మరణించిన నేపథ్యంలో..

11 మంది మరణించిన నేపథ్యంలో..

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు- నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభల్లో సంభవించిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో- అలాంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీఓ ఇది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటీషన్లు దాఖలు కాగా- ధర్మాసనం వాటికి అనుకూలంగా మధ్యంతర తీర్పు వెలువడించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఈ జీఓను సస్పెండ్ చేసింది.

జీఓను తప్పుపట్టిన కేశవ్..

జీఓను తప్పుపట్టిన కేశవ్..

ఇదే జీఓపై తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఉరవకొండ శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడారు. దేశ రాజధానిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జీఓను తప్పుపట్టారు. ఢిల్లీ నడిబొడ్డున స్వయానా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా రోడ్ షో నిర్వహించగలిగారని, ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. నగరాల్లో కాదు కదా.. కనీసం మారుమూల గ్రామాల్లో కూడా రోడ్ షో చేసే స్వేచ్ఛను కోల్పోయామని ఆయన విమర్శించారు.

ఢిల్లీలో..

ఢిల్లీలో..

రిమోట్ ఓటింగ్ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన హాజరయ్యారు. ఈ సమావేశానికి మొత్తం 16 పార్టీలు హాజరయ్యాయి. ఈ భేటీ ముగిసిన అనంతరం పయ్యావుల కేశవ్ విలేకరులతో మాట్లాడారు. ఎమర్జెన్సీ నాటి నిషేధాజ్ఞల కంటే దారుణంగా ఏపీ ప్రభుత్వం జీఓ నంబర్ 1ను జారీ చేసిందని ధ్వజమెత్తారు.

అత్యవసర పరిస్థితి..

అత్యవసర పరిస్థితి..

దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన సమయంలో సభలు, సమావేశాలు పెట్టినవారిపై కేసులు నమోదు చేసే వారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీలో కనీసం సభ పెట్టడానికి కూడా అనుమతులు దక్కట్లేదని పేర్కొన్నారు. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టకముందే కేసులు పెడుతున్నారని, హౌస్ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

హిట్లర్, ముస్సోలినీ..

హిట్లర్, ముస్సోలినీ..

ఏపీలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లో లేదని, ముస్సోలినీ, హిట్లర్ తరహా రాజ్యాంగాలను అమలు చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. జీఓ నంబర్ 1 ద్వారా ప్రతిపక్షాలకు ప్రాథమిక హక్కుగా దక్కిన వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు.

జనాదరణను చూసి..

జనాదరణను చూసి..

తమ పార్టీ నాయకులు రోడ్ షోలు, సభలను ఏర్పాటు చేస్తోంటే వైఎఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారని, చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక, ఇలాంటి చీకటి జీఓలను విడుదల చేశారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఈ జీఓ అమలు కాకుండా చూస్తామని హెచ్చరించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించ తలపెట్టిన యువ గళం పాదయాత్ర నిర్దేశిత సమయంలోనే ప్రారంభమౌతుందని అన్నారు.

జైల్ భరోకు సిద్ధం..

జైల్ భరోకు సిద్ధం..

నారా లోకేష్ పాదయాత్రను కొనసాగింపజేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు దేనికైనా సంసిద్ధంగా ఉన్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. పోలీసులు అరెస్టులకు పాల్పడితే దానికైనా వెరవబోమని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం ఎలాంటి కేసులు పెట్టినా ఖాతరు చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే తెలుగుదేశం శ్రేణులు 'జైల్ భరో'కు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+