ఏపీ అసెంబ్లీలో మేల్ అందాల పోటీలు..! టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ డిమాండ్..!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా టీడీపీ, అసెంబ్లీ బయట వైసీపీ మాటల తూటాలు పేలుస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కంటే ముందే వేడెక్కింది. ఇదే క్రమంలో నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు,ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. ఇందులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కూడా అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని స్పీకర్ అయన్నపాత్రుడు తాజాగా ప్రకటించారు. అదే సమయంలో జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై ప్రెస్ మీట్ పెట్టి మరోసారి వివరణ ఇచ్చారు. ఈ రెండు అంశాల్ని కలుపుతూ సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అసెంబ్లీకి రప్పించేందుకు అందాల పోటీలు పెట్టాలంటూ స్పీకర్ కు ఆయన సూచించారు. అది ఎందుకో కూడా సోమిరెడ్డి స్పష్టంగానే వివరణ ఇచ్చారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పోర్ట్స్ మీట్ ప్రకటించారని, అలాగే అసెంబ్లీలో పురుష ఎమ్మెల్యేలకు మాత్రం అందాల పోటీలు పెడితే వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ వచ్చి వాటిని ఆస్వాదిస్తారని సోమిరెడ్డి సూచించారు. పురుషుల్లో అందాల్ని చూసే అలవాటు ఉన్న జగన్ అలా అయినా అసెంబ్లీకి వస్తారేమో చూడాలంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి వెళ్లి పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ ను ఉద్దేశించి సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార, విపక్షాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.












Click it and Unblock the Notifications