గెలిచి ఏదో చేద్దాం అనుకున్నా.. ఇంతకన్నా దరిద్రం ,దౌర్భాగ్యం లేదు - అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీలో ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ..ఎన్నికల్లో గెలవగానే ఏదో చేసేద్దాం అనుకున్నా, మీడియాతో కూడా అదే చెప్పాను..అయితే ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఈ తొమ్మిది నెలల్లో ఏం చేయలేకపోయా, ఇంతకన్నా దరిద్రం ,దౌర్భాగ్యం లేదంటూ యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది సమయం కాదంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు యార్లగడ్డ వెంకట్రావును సున్నితంగా హెచ్చరించడం ఈ వీడియోలో వినిపించింది.అయితే ఆయన ఏ టాపిక్ మీద మాట్లాడరనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు ఈ వీడియోను వైసీపీ తమ సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ వైరల్ చేస్తున్నారు. తొమ్మిది నెలల్లోనే కూటమి పాలన ఎలా ఉందో ఎమ్మెల్యే మాటాల్లోనే అర్థం అవుతుందంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

TDP MLA Yarlagadda Venkata Rao expressed his dissatisfaction

అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఎటువంటి పనులు జరగడం లేదని అసహనం వ్యక్తం చేయడం ఏంటని వైసీపీ శ్రేణులు ఎద్దెవా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే యార్లగడ్డ వెంకట్రావు గతంలో వైసీపీలో కొనసాగారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ, గత వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడంతో యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ముందు టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన వల్లభనేని వంశీపై ఆయన ఘన విజయం సాధించి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు. వంశీపై పలు కేసులు నమోదు కావడంతో ఆయన జైలులో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+