స్విగ్గీ డెలివరీలు చేసుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే..! రీజన్ ఇదే..!
ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిలోనూ కూటమి సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమయంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారమెత్తారు. ఇంటింటికీ తిరుగుతూ స్విగ్గీ ఆర్డర్లు డెలివరీ చేసుకుంటున్నారు. ఇదంతా చూసిన ప్రజలు తమ ఎమ్మెల్యే ఇలా ఎందుకు స్విగ్గీ డెలివరీలు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చర్చించుకుంటున్నారు.
అమరావతి పరిధిలోకి వచ్చే కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తాజాగా స్విగ్గీ బాయ్ గా మారిపోయారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన తాజాగా స్విగ్గీ డెలివరీలు అందిస్తూ కనిపించారు. స్విగ్గీ యాప్ లో ఫుడ్ ఆర్డర్ పెడితే స్వయంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వచ్చి దాన్ని అందించడంతో జనం అవాక్కవుతున్నారు. దీంతో అసలు కారణం ఏంటో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇలా స్విగ్గీ యాప్ డెలివరీ బాయ్ గా మారడానికి వెనుక ఉన్న కారణం ఆయన తన నియోజకవర్గంలోని స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ కష్టాలు తెలుసుకునేందుకే అట. అందుకే ఆయన డెలివరీ బాయ్ టీ షర్ట్ ధరించి తన బుల్లెట్ పై వెళ్లి పార్సిల్స్ అందించినట్లు స్థానిక నాయకులు చెప్తున్నారు. ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి పార్సిల్స్ ఇవ్వడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఎమ్మెల్యే ఇలా తాను ఎందుకు స్విగ్గీ డెలివరీలు అందించాల్సి వస్తుందో కూడా వారికి వివరిస్తున్నారు. ఇది విన్న జనం అవాక్కవుతున్నారు. స్విగ్గీ బాయ్స్ కష్టాలు తెలుసుకోవాలంటే ఎమ్మెల్యే స్విగ్గీ బాయ్ గానే మారాలా అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications