వారిలో అత్యంత ధనవంతుడు నారా లోకేష్‌ - ఆస్తులు ఎంతంటే..!!

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఏపీ శాసనమండలి సభ్యుల ఆస్తులు - విద్యార్హత- క్రమినల్ కేసుల గురించి వారి అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించింది. ఏపీ శాసన మండలి సభ్యుల్లో 20 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. అందులో 13 మంది వైసీపీ సభ్యులు కాగా, ఆరుగురు టీడీపీ నుంచి.. ఒకరు పీడీఎఫ్ కు చెందిన వారు ఉన్నట్లుగా నివేదికలో తేల్చారు. ఆస్తుల పరంగా ఎమ్మెల్సీల్లో 12 మంది రూ పది కోట్ల పైగా ఉన్నట్లుగా పేర్కొన్నారు.

తొలి స్థానంలో నారా లోకేష్

తొలి స్థానంలో నారా లోకేష్

అందులో అత్యధిక ఆస్తి పరుడుగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ నిలిచారు. ఆయన మొత్తం ఆస్థి విలువ రూ 369.27 కోట్లుగా నిర్దారించారు. రెండో స్థానంలో రూ.101 కోట్లతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఉండగా, మూడో స్థానంలో రూ.36 కోట్లతో ఎమ్మెల్సీ టి.మాధవరావు ఉన్నారు. అతి తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్సీగా స్వతంత్ర సభ్యుడు రఘువర్మ రూ 1.84 లక్షలతో ఉన్నారు. కాగా, నారా లోకేశ్ కు రూ 6.27 కోట్లు అప్పు ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ దేవసాని చిన్న గోవిందరెడ్డికి రూ 5.23 కోట్లు అప్పులు ఉన్నట్లుగా నివేదికలో తేల్చారు.

ఇద్దరికి డాక్టరేట్లు

ఇద్దరికి డాక్టరేట్లు


మొత్తం సభ్యుల్లో 36 మంది కోటీశ్వరులేనని స్పష్టమైంది. ఇక..తీవ్రమైన కేసులు ఉన్న వారిలో వైసీపీ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్.. గుంగుల ప్రభాకర రెడ్డి..అనంత సత్య బాస్కర్ పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అభ్యర్థులు అందించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. 48 మంది ఎమ్మెల్సీల్లో ఇద్దరు డాక్టరేట్లు...8 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు..అయిదుగురు గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్.. నలుగురి విద్యార్హత ఇంటర్మీడియట్ గా ఉంది. ఒకరు పదో తరగతి.. మరకొరు అయిదో తరగతి పాసయ్యారు.

Recommended Video

    సిగ్గులేకుండా అబద్ధాలా, డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డికి వ్యసనం *AndhraPradesh | Telugu OneIndia
    క్రిమినల్ కేసుల వివరాల మేరకు

    క్రిమినల్ కేసుల వివరాల మేరకు

    కాగా, సభలో ముగ్గురు మహిళా ఎమ్మెల్సీలు ఉండగా అందులో ఇద్దరు వైసీపీ నుంచి..ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. ఎనిమిది మంది 5-12వ తరగతి మధ్య, 40 మంది గ్రాడ్యుయేట్‌ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారని తెలిపింది. అతిపెద్ద వయస్కులు సైతం వైసీపీ నుంచే ఉన్నారు. వారిలో ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు వయసు 86 రాగా, మురుగుడు హనుమంతరావు 73 ఏళ్లు, సీ రామచంద్రయ్య 71 ఏళ్ల వయసు గా నివేదిక లో పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+