జగన్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి.. కేంద్ర ఎన్నికల సంఘానికి వర్ల రామయ్య విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్, ఆయన పార్టీ నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నల వర్షం కురిపించారు.వైసీపీని రాజకీయ పార్టీగా కాకుండా అసాంఘిక శక్తుల అడ్డాగా వర్ణించిన వర్ల రామయ్య, జగన్‌ను ముఠా నాయకుడిగా అభివర్ణించారు.

నైతిక విలువలు లేని పార్టీకి అధ్యక్షుడు జగన్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు న్యాయం చేయడానికి ఉంటాయి తప్ప స్వార్థ రాజకీయాల కోసం కాదని అన్నారు. జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వర్ల రామయ్య ప్రశ్నించారు. "పులివెందులకు వస్తా, చేతులు మడుస్తా అని చెప్పడం అరాచకం కాదా? పోలీసులను, ప్రజలను భయపెట్టడం తగునా?" అని అడిగారు.

TDP MLC Varla Ramaiah Demands Cancellation of YSRCP Recognition by Election Commission

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎందుకు రాష్ట్రం వదిలి పరారయ్యాడో సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం, కల్తీ మద్యం, స్వామివారి లడ్డూ కల్తీ వంటి కేసుల్లో అరెస్టయిన నాయకులను చూసి కూడా ఇది రాజకీయ పార్టీ అని చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలీసులను భయపెట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

తల్లి, చెల్లిని నిర్లక్ష్యం చేసిన జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా? అని నిలదీశారు.ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు పాల్పడినట్లు ఆరోపించిన అరాచకాలపై కూడా వర్ల రామయ్య మాట్లాడారు. అనేక చోట్ల నామినేషన్లకు అడ్డంకులు, పోలీసులపై దాడులు, బారికేడ్లు తొలగించడం వంటి సంఘటనలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.వైసీపీ నేతల వ్యాఖ్యలు, వీడియోలు, ప్రెస్ క్లిప్పింగ్‌లను సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని, పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన కోరారు.

గ్రేటర్ విశాఖ వాసులకు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి
గ్రేటర్ విశాఖ వాసులకు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి

గతంలోనూ వర్ల రామయ్య వైసీపీపై ఇలాంటి ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో జరిగినట్లు చెప్పుకునే హింసాత్మక సంఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, ఎస్ఐటి విచారణ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఇరు పార్టీలు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో వర్ల రామయ్య తాజా కేంద్ర ఎన్నికల సంఘం జగన్ పార్టీ గుర్తింపు రద్దు చెయ్యాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+