టీడీపీ ఆపరేషన్ కడప, జగన్ అలర్ట్ - కీలక నిర్ణయం..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతలు వరుసగా స్థానిక సంస్థలను తమ ఖాతాలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా జగన్ సొంత జిల్లా కడప పైన గురి పెట్టారు. కడపలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన టీడీపీ..ఇప్పుడు జెడ్పీ కైవసం చేసుకోవటం పైన మంత్రాంగం ప్రారంభించింది. దీంతో, జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లా నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
కడప పై టీడీపీ గురి
విశాఖ ఎమ్మెల్సీ స్థానం ఎట్టకేలకు వైసీపీకి దక్కింది. అక్కడ కూటమి చివరి వరకు దక్కించుకొనేందుకు వ్యూహాలు అమలు చేసింది. అయితే, వైసీపీ ముందుగానే అప్రమత్తమై తమ ఓటర్లను జాగ్రత్త చేసుకోవటం తో సంఖ్యా బలం లేని టీడీపీ చివరి నిమిషంలో వెనుకడుగు వేసింది. ఇక..ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడప పైన గురి పెట్టింది. కడప జిల్లా పరిషత్ చైర్మన గా ఆకేపాటి అమర్నాధ రెడ్డి వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో, ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసారు.

వైసీపీ అప్రమత్తం
కడప జిల్లా పరిషత్ లో 50 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. అందులో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కడప జిల్లాలో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తరువాత అయిదుగు జెడ్సీటీసీ టీడీపీలో చేరగా.. మరో జెడ్పీటీసీ బీజేపీకి దగ్గరయ్యారు. మిగిలిన జెడ్పీటీసీలతోనూ జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు మంత్రాంగం చేస్తున్నారు. జగన్ ను తన సొంత జిల్లాలోనే దెబ్బ తీయానేలనేది ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు భావిస్తున్నారు. దీంతో, జగన్ అప్రమత్తం అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు.
జగన్ పిలుపు
దీంతో, బెంగళూరు పర్యటనలో ఉన్న జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లాలోని పార్టీకి చెందిన జెడ్పీటీసీలు అందరూ ఈ నెల 21న తాడేపల్లికి రావాల్సిందిగా పిలుపు ఇచ్చారు. వారిని తీసుకొచ్చే బాధ్యత పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. వారితో జగన్ నేరుగా సమావేశం కానున్నారు. వారికి భవిష్యత్ పైన భరోసా ఇస్తూ పార్టీ వీడకుండా మార్గదర్శకం చేయనున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారంతో..వారితో జగన్ వ్యక్తిగతంగానూ మాట్లాడుతారని తెలుస్తోంది. దీంతో, కడపలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications