టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగియనున్నాయి. దీంతో ఎవరెవ్వరు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ, వైసీపీ అధినేత జగన్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి ఊహించని స్పందన లభించింది. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చూట్టారు.

సిద్ధం సభలకు పార్టీ కార్యకర్తల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన లభించింది. దీంతో మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 25 జిల్లాలను కవర్ చేస్తూ సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రకు మించిన ప్రజాధారణ బస్సు యాత్రకు లభిస్తోందని వైసీపీ నేతలు చేబుతున్నారు.

tdp mp candidate lavu krishna devarayalu shocking comments

జగన్ ప్రజలతో మమేకం అవుతున్న తీరుకు ప్రతిపక్షాలు సైతం షాక్ అవుతున్నాయి. జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఎక్కడ కూడా వ్యతిరేకత ఉన్నట్టు కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే జగన్ చేపట్టిన ఈ బస్సుయాత్ర పార్టీకి ఫుల్ మైలేజ్ తీసుకువచ్చింది. ఇదే సమయంలో రెండు నెలలకు ముందు వైసీపీ ఎన్నికల కంపైన్‌లో ఏదైతే చెప్పారో అది సరిగ్గా జరగడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది.

జగన్‌ను ఓడించడానికి పార్టీలన్నీ కూడా ఏకం అవుతాయంటూ వైసీపీ ఓ సాంగ్‌ను విడుదల చేసింది. ఆ పాటలో చెప్పినట్టుగానే అందరూ కూడా ఒకటైన పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది. ఇక పేదలకు పెత్తందారులకు మధ్య జగన్ ఉండగా..ఆయన్ను చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు రాళ్లతో కొట్టిన పోస్టర్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ పోస్టర్‌లో ఉన్నట్టుగానే జగన్ విజయవాడలో అడుగుపెట్టగానే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కూడా వైసీపీకి అనుకూలంగా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. లావు కృష్ణ దేవరాయలు ఇటీవలే టీడీపీలో చేరి ఆ పార్టీ తరుఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. తాజాగా ఆయన ప్రముఖ జాతీయ ఛానెల్ ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌‌కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. ఆయన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టీడీపీ చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలుపు అంత ఈజీ కాదని ఆయన తెలిపారు.

tdp mp candidate lavu krishna devarayalu shocking comments

ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల టీడీపీకి పెద్ద మేలు జరిగింది ఏమీ లేదని లావు కృష్ణ దేవరాయలు వ్యాఖ్యానించారు.బీజేపీ మాతో జతకట్టింది కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయిందని ఆయన తెలిపారు. లావు కృష్ణ దేవరాయలు గెలుపు కష్టమే అని తేల్చడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నారు. ఇక లావు కృష్ణ దేవరాయలు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ సెటైర్స్ వేస్తోంది. టీడీపీ అభ్యర్థులకే గెలుస్తామనే నమ్మకం లేదనే విషయం ఇక్కడే అర్థమవుతుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందని వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+