TDP MP Candidates: టీడీపీ ఎంపీ అభ్యర్ధుల ప్రకటనకు ముహుర్తం ఖరారు..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన తమ ఉమ్మడి అభ్యర్ధుల్ని ప్రకటిస్తున్నాయి. తొలి జాబితాలో మాత్రం 99 మంది టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధుల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించగా.. ఆ తర్వాత నుంచి విడివిడిగానే ప్రకటించాలని నిర్ణయించాయి. ఈ మేరకు 34 మందితో టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదలైంది. ఇప్పుడు మూడో జాబితాలో పూర్తిగా ఎంపీ అభ్యర్ధుల ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ తరఫున ఈసారి పోటీ చేస్తున్న 17 లోక్ సభ స్ధానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను విడుదల చేయబోతున్నారు. ఇందులో చాలా మంది ఇప్పటికే ఎంపికైన వారు కాగా.. ఒకట్రెండు స్దానాల్లో మాత్రమే కొత్త వారికి అవకాశం దక్కబోతోంది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పలువురు సిట్టింగ్ ఎంపీలకు కూడా అవకాశం కల్పించబోతున్నారు. మొత్తంగా 17 మంది ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ మాత్రం ఇవాళ సాయంత్రం వెలువడనుంది.

మరోవైపు 10 మందికి పైగా అభ్యర్ధులు ఇప్పటికే ఖరారు అయ్యారని, వీరి పేర్లను మాత్రమే ప్రకటించి ఆ తర్వాత మరో జాబితాలో మిగిలిన పేర్లు ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే సాధ్యమైనంత త్వరగా అభ్యర్ధుల ప్రకటనలు పూర్తి చేసి ప్రచార పర్వంలోకి పూర్తి స్దాయిలో దిగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే చాలా మందుగానే అభ్యర్ధుల ఎంపికలు, ప్రకటనలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications