Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిపై లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన టీడీపీ ఎంపీ- వివరణ ఇచ్చిన మంత్రి..!!

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమౌతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పార్టీపరంగా తరలింపు కార్యక్రమాలను కూడా మొదలు పెట్టింది. భవిష్యత్ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమిపూజ కూడా చేశారు. కొత్త సంవత్సరంలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలవుతుందనీ చెప్పారు.

జాప్యం చెయ్యకుండా..

జాప్యం చెయ్యకుండా..

ఈ విషయంలో న్యాయపరమైన అడ్డంకులు కూడా తొలగిపోతున్నట్లుగా భావిస్తోంది వైసీపీ ప్రభుత్వం. రాజధానిగా అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతోంది. సుప్రీంకోర్టు నుంచి స్టే లభించిన నేపథ్యంలో- ఇక జాప్యం చెయ్యకుండా విశాఖపట్నానికి సచివాలయం, ఇతర శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలను తరలించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది.

టీడీపీ ఆందోళన..

టీడీపీ ఆందోళన..

ఈ పరిస్థితుల మధ్య- రాజధాని అమరావతిలో అభివృద్ధి స్తంభించిపోయిందని, భవిష్యత్తులో ఈ నగర పరిస్థితి ఏమవుతందనే ఆందోళనను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తోంది. రాజధాని అభివృద్ధి కోసం తాము వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెబుతోంది. తమ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయించుకున్నామనీ స్పష్టం చేస్తోంది.

లోక్‌సభలో ప్రస్తావన..

లోక్‌సభలో ప్రస్తావన..

ఇదే విషయాన్ని తాజాగా టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో లేవనెత్తారు. అమరావతి అభివృద్ధి గురించి, దీనికోసం ఖర్చు చేసిన నిధుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారాయన. స్మార్ట్ సిటీ కింద అమరావతి క్యాపిటల్ రీజియన్ పరిధిలో రెండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 20 ప్రాజెక్టులకు సంబంధించిన 25 వర్క్ ఆర్డర్లు మంజూరు అయ్యాయని చెప్పారు.

ఒక్క పని కూడా

ఒక్క పని కూడా

ప్రస్తుతం వాటికి సంబంధించిన ఒక్క పని కూడా ఇప్పటివరకు పూర్తి కావట్లేదని గల్లా జయదేవ్ అన్నారు. దీనికి గల కారణాలను కూలంకషంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఈ పనులన్నింటినీ ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయో తెలియజేయాలని అన్నారు.

స్పందించిన హర్దీప్ సింగ్ పురి

స్పందించిన హర్దీప్ సింగ్ పురి

గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద అమరావతి పరిధిలో మొత్తం 21 వర్క్ ఆర్డర్లు కొనసాగుతున్నాయని చెప్పారు. 2,046 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణ పనులను చేపట్టామని వివరించారు. పనులు శరవేగంగా పూర్తి చేయడానికి 488 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇందులో తన వాటా మొత్తం 298 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+