Kesineni Swetha : రతన్ టాటా ఇంట్లో కేశినేని కుమార్తె పుట్టినరోజు వేడుకలు..

విజయవాడ టీడీపీ ఎంపీ, సీనియర్ నేత కేశినేని శ్రీనివాస్(నాని) కుమార్తె కేశినేని శ్వేత ఈసారి తన పుట్టినరోజును వెరైటీగా జరుపుకున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఆమెకు ఓ అరుదైన ఆహ్వానం అందడంతో శ్వేత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా వివాహం చేసుకున్న తన భర్తతో కలిసి తన పుట్టినరోజు వేడుకల్ని ఆ ఆహ్వానం అందించిన వారి ఇంట్లోనే చేసుకున్నారు.

ప్రఖ్యాత వ్యాపారవేత్త, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను తన పుట్టినరోజున ఆయన ఇంటికి రావాలని ఆహ్వానించారు. దీంతో ముంబైలోని ఆయన ఇంటికి భర్తతో కలిసి ఆమె వెళ్లారు. కేవలం ఈ ముగ్గురు శ్వేత పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ముంబైలోని తన నివాసానికి వచ్చిన శ్వేత దంపతుల్ని రతన్ టాటా స్వయంగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లారు.

kesineni swetha birthday celebrations

అనంతరం శ్వేతతో స్వయంగా రతన్ టాటా పుట్టినరోజు కేక్ కట్ చేయించారు. ఆమె భర్త పక్కనే ఉండగా.. రతన్ టాటా శ్వేత చేయి పట్టుకుని కేక్ కట్ చేయించి తన ఆప్యాయత చాటుకున్నారు. మానవ సంబంధాల గురించి ఎప్పుడూ చెప్పే రతన్ టాటా తనతో అనుబంధం ఉన్న విజయవాడ ఎంపీ కుమార్తెను ఇంటికి పిలిపించుకుని మరీ పుట్టినరోజు కేక్ కట్ చేయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టాటాల్లో మానవ సంబంధాల పట్ల ఉన్న గౌరవానికి కూడా ఇది అద్దం పట్టింది.

kesineni swetha birthday celebrations

వాస్తవానికి విజయవాడ ఎంపీగా తొలిసారి టీడీపీ నుంచి గెలిచిన కేశినేని శ్రీనివాస్.. టాటా సంస్ధల సాయంతో తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలు ఎంత విజయవంతం అయ్యాయంటే వాటి సాయంతోనే కేశినేని రెండోసారి వైసీపీ గాలిని తట్టుకుని మరీ కనీస ఓట్లతో గట్టెక్కారు. దీంతో అప్పటి నుంచి టాటా గ్రూప్ సంస్ధల మాజీ అధిపతి రతన్ టాటాతో, ఆయన కుటుంబంతో కేశినేని కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+