టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దారుణ హత్య .. దారికాచి మరీ హతమార్చిన దుండగులు
ఏపీలో రాజకీయనాయకుల హత్యలు పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు హత్యకు గురైతే, ఇక టిడిపి సానుభూతిపరుల, కార్యకర్తల, గ్రామ స్థాయి నేతల హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి, గ్రామ కమిటీ అధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యారు.
నాగాయలంక మండలం లోని పర్ర చివర శివారు పెదగౌడపాలెం కు చెందిన తాత సాంబశివరావు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్రచివర ఎంపీటీసీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయనను దారికాచి మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు దుండగులు. పాత కక్షలు ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నాగాయలంక లో పని పూర్తి చేసుకొని పెద పాలెం మీదుగా మెరక పాలెం వెళుతుండగా జన సంచారం లేని నిర్మానుష్య ప్రదేశంలో పక్కా ప్లాన్ తో మారణాయుధాలతో దాడి చేసిన దుండగులు సాంబశివరావును హతమార్చారు.

పాత కక్షలలో భాగంగా ఈ దారుణం జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు ఈ దారుణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. గతంలో సాంబశివరావు పరిశె చంటి అనే వ్యక్తి పై దాడి చేసి గాయపరిచాడు. అయితే ఆ కేసులో చంటికి న్యాయం జరగక పోవడంతో ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భాగంగా టిడిపి నాయకుడు సాంబశివరావుపై పక్కా ప్లాన్ తో మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications