సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ - ప్రజల్లోనే తేల్చుకుందాం..!!

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ..టీడీపీ సీఎం జగన్ కు సవాల్ చేస్తోంది. మూడు రాజదానుల పైన ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళ్లాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఈ అంశం పైనే ప్రభుత్వాన్ని సవాల్ చేసేందుకు టీడీపీ సిద్దమవుతోంది. తాజాగా జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలకు పార్టీ అధినేత చంద్రబాబు దూరంగా ఉంటున్నారు.

సభలో టీడీపీ వ్యూహం ఖరారు

సభలో టీడీపీ వ్యూహం ఖరారు

ఇక.. సభలో మొత్తం 20 అంశాలను పార్టీ నుంచి చర్చకు పట్టుబట్టాలని సమావేశం లో నిర్ణయించారు. మూడు రాజధానుల పైన ప్రభుత్వం ప్రకటన చేసే సమయంలో.. రాజధాని పైన ప్రజాభిప్రాయం కోరేందుకు అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమా అని నిలదీయాలని నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మూడేళ్ల కాలానికి పైగా కొనసాగుతున్న తమ పాలనలో అమలు చేసిన సంక్షేమం .. సామాజిక న్యాయం పైన సభలో చర్చ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ సైతం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా అంశాలను సభలో ప్రస్తావించేందుకు సిద్దం కావాలని పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు.

15-20 అంశాలపై చర్చకు పట్టు

15-20 అంశాలపై చర్చకు పట్టు

భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం, టిడ్కో ఇళ్ల పంపిణీ, గృహ నిర్మాణం, దళితులు, మైనార్టీలపై దాడులు, క్షీణించిన శాంతిభద్రతలు.. తదితర అంశాలపై సభలో ప్రస్తావించాలని నిర్ణయించారు. వీటితో పాటుగా బాక్సైట్ అక్రమ మైనింగ్, మద్యం కుంభకోణం, నిత్యావసర ధరల పెరుగుదల, ప్రజలపై భారాలు, పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యంపై.. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అమరావతి రాజధాని అంశాలపైనా చర్చకు పట్టుబట్టాలని నేతలు నిర్ణయించారు. మరోవైపు అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ చేస్తున్న.. తాజా అరెస్టులపైనా చర్చించారు.

మూడు రాజధానులు- ప్రజాభిప్రాయం

మూడు రాజధానులు- ప్రజాభిప్రాయం

బీఏసీ సమావేశంలోనే అధికార - ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా వాదనలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. రాజధాని బిల్లులను తిరిగి సభలో ప్రవేశ పెట్టే అవకాశం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల స్పష్టం చేసారు. మంత్రులు వరుసగా మూడు రాజధానులు.. రైతుల పాదయాత్ర పైన స్పందిస్తున్నారు. దీంతో..అటు ప్రభుత్వం సభా వేదికగా దీని పైన క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అధికార వికేంద్రీకరణ పైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది. దీంతో..ఈ సారి సమావేశాలు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+