షర్మిలా! భవనాలెక్కడివి: టిడిపి, టిపై చెప్పిందే: కాంగ్

వారు గవర్నర్ నరసింహన్‌ను సాయంత్రం నాలుగు గంటలకు కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి గీతా రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆమెను బర్తరఫ్ చేయాలని తాము గవర్నర్‌ను కోరామన్నారు. అవినీతి మంత్రుల విషయంలో గతంలో ఉన్న పద్ధతినే పాటిస్తామని గవర్నర్ చెప్పారన్నారు.
కేంద్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ కంపెనీల పైన కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంపదను దోచుకున్న కుటుంబ సభ్యులు సిగ్గులేకుండా నాయకులుగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
బాబువి అర్థం లేని ప్రసంగాలు: పార్థసారథి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన యాత్రలో అర్థం లేని ప్రసంగాలు చేస్తున్నారని మంత్రి పార్థసారథి విజయవాడలో అన్నారు. సమైక్య ఉద్యమంలోకి రౌడీ మూకలు వస్తున్నాయని, అలా అయితే చెడ్డ పేరు వస్తుందన్నారు. విభజన విషయంలో కేంద్ర మంత్రుల తప్పిదం లేదని, 21న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.
తెలంగాణపై చెప్పిందే చేస్తున్నాం: అఫ్జల్
తెలంగాణ విషయంలో తాము చెప్పిందే చేస్తున్నామని ఏఐసిసి అధికార ప్రతినిధి అఫ్జల్ న్యూఢిల్లీలో చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ అల్లర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అన్నారు.












Click it and Unblock the Notifications