వీర జవాన్ల మరణాల్లోనూ కులాన్ని బట్టి సాయమా ? వైసీపీ తీరుపై టీడీపీ ఫైర్..
ఏపీకి చెందిన వీరజవాన్ల కుటుంబాలకు అందించే సాయం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని విపక్ష టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. కులాన్ని బట్టి వీర జవాన్ల కుటుంబాలకు సాయం చేస్తారా అని వైసీపీ సర్కారును నిలదీసింది. తాజాగా జరిగిన రెండు ఘటనలను ప్రస్తావిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సహాయం అందించడం మన రాష్ట్ర అధికారపార్టీకే చెల్లిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన వజ్రపుకొత్తూరు మండలం పలాస నియోజకవర్గానికి చెందిన బొంగు బాబురావు కుటుంబానికి కనీసం ఒక సంతాపసందేశం కూడా పంపలేని ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 50 లక్షలరూపాయల ఆర్థిక సాయం ప్రకటించడం సరికాదన్నారు.

అమరవీరుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించడాన్ని విమర్శించటం లేదు కానీ బొంగు బాబురావు కుటుంబానికి ఎందుకు సహాయం చేయలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రజలు గమనించటం లేదా, లేక గమనించి కూడా అడిగే దేర్యం చేయటం లేదా అర్ధం కావటం లేదని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరణాన్ని కూడా కులాలతో చూస్తున్న ప్రభుత్వం వలన రాష్ట్ర పతనమే తప్ప ఇంకొకటి లేదన్నారు..
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!











Click it and Unblock the Notifications