వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత - సీమ జిల్లాలో వరుస షాక్ లు..!!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం హోరా హోరీగా మారుతోంది. వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో 2019 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయటం లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సీట్లు రాని కూటమి నేతలను తమ వైపు తిప్పుకొనేందకు ప్రయత్నం చేస్తోంది. కర్నూలు జిల్లాలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.

వైసీపీలోకి టీడీపీ నేతలు
కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ సారి అదే విధంగా గెలవాలని ప్రయత్నిస్తోంది. జిల్లాలోని 14 స్థానాల్లో టీడీపీ 13, బీజేపీ ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. జనసేనకు ఇక్కడ సీటు దక్కలేదు. ఈ సమయంలోనే టీడీపీలో సీట్లు దక్కని నేతలు వైసీపీ బాట పడుతున్నారు. జిల్లాలో ఏరాసు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాపరెడ్డి ఎమ్మెల్యేగా పని చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏరాసుకు సీటు దక్కలేదు. దీంతో, ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించారు.

TDP Rayalaseema senior leader yerasu pratapa reddy to join in ysrcp soon

వైసీపీలో చేరనున్న ఏరాసు
కర్నూలు జిల్లాలో టీడీపీలో నెలకొన్న పరిస్థితులన తమకు అనుకూలగా మలచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లాలో జగన్ సిద్దం యాత్ర సమయంలో జిల్లాలోని అన్నినియోజకవర్గ నేతలతో సమీక్ష చేసారు. ప్రచారంలో వస్తున్న స్పందేన..సర్వే నివేదికలు..కూటమి వ్యూహాల పైన అభ్యర్దులకు దిశా నిర్దేశం చేసారు. కర్నూలు జిల్లాలో 2019 తరహాలోనే ఫలితాలు ఉండాలని నిర్దేశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కర్నూలు సిటీ నుంచి మార్పు చేసారు. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ కు కర్నూలు సిటీ సీటు కేటాయించారు. కాగా, జిల్లాలో కోట్ల..కేఈ కుటుంబాలు టీడీపీలో కొనసాగుతున్నాయి. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ నుంచి పోటీ చేస్తున్నారు. కేఈ కుమారుడు శ్యాంబాబు పత్తికొండ నుంచి బరిలో ఉన్నారు.

TDP Rayalaseema senior leader yerasu pratapa reddy to join in ysrcp soon

కర్నూలు పై జగన్ గురి
అయితే, కేఈ ప్రభాకర్ సైతం టీడీపీ వీడాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన కుమారుడు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇక..ఏరాసు ప్రతాపరెడ్డి శ్రీశైలం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి తిరిగి సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ, సీటు దక్కలేదు. తొలి నుంచి వైఎస్సార్ కుటుంబంతో ఏరాసుకు సత్సంబంధాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఏరాసు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. కానీ,తాజాగా వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లటంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12,13 తేదీల్లో ప్రతాప రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+